సత్యం కంప్యూటర్స్‌కు చెందిన రూ. 822 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్తంభింపజేసిన ఈడీ

Ramalinga Raju
Tech Mahindra: Quotes, News
BSE 1520.40BSE Quote22.9 (-1.51%)
NSE 1510.50NSE Quote31.7 (-2.10%)
హైదరాబాద్: సత్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన రూ. 822 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను(ఎఫ్‌డీ)లను నిన్న స్తంభింపజేస్తూ అటాచ్‌మెంట్ ఆదేశాలను జారీ చేసింది. ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌, ఐఎన్‌జీ వెైశ్యాబ్యాంకు లిమిటెడ్‌లలో సత్యం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసింది. కంపెనీ మాజీ చెైర్మన్‌ బి రామలింగరాజుతో పాటు మిగిలిన వ్యక్తులు మనీ ల్యాండరింగ్‌ చట్టం కింద నేరం చేసినట్లు రుజులెైనందు వల్ల వారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లను స్తంభింపజేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఈడీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంతో ప్రమేయం ఉన్న రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు ఆర్దిక అవకతవలకలకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తమ విచారణలో రామలింగరాజు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహాచరులు కంపెనీ షేర్లను పెంచి చూపి అక్రమంగా విక్రయించడం లేదా తనఖా పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు తేలిందని, ఈ కారణంతో అకౌంట్లను స్తంభింప జేసినట్లు ఈడీ తన ఆదేశాల్లో వివరించింది. బినామీ కంపెనీల ద్వారా సమీకరించిన రూ. 2,171 కోట్ల మొత్తంలో రూ. 822 కోట్లు సత్యం కంప్యూటర్స్‌లోకి మల్లించారు. ఎన్‌బీఎఫ్‌ల నుంచి తీసుకున్న రూ.2,717.45 కోట్లలో రూ.822 కోట్లు ఎఫ్‌డీలలోకి పోగా... మిగిలిన డబ్బు ఉద్యోగుల వేతనాలకు, ఖర్చులకు వాడుతుకున్నారని ఈడీపేర్కొంది.

ఎన్‌బీఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణాలను రాజు ఏర్పాటు చేసుకున్న 327 కంపెనీలతో పాటు తన బంధువులు, మిత్రుల కంపెనీలకు తరలించారని ఈడీ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫ్రంట్‌ కంపెనీలు ఈ డబ్బుతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో స్థిరాస్తులు కొనుగోలు చేశారని వివరించింది. ఈడీ ఇప్పటికే రాజుకు సంబంధించిన 354 స్థిరాస్తులను వాటి విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుంది వాటిని జప్తు చేసింది. 2009 జనవరిలో రూ.7,136 కోట్ల ఖాతాల్లో గోల్‌మాల్‌ చేసినట్లు రామలింగ రాజు ఒప్పుకున్నారు. దీంతో సత్యం కంప్యూ టర్స్‌ సంక్షోభంలో కూరుకుపో యింది. అప్పటికి దేశంలో సత్యం నాలుగోస్థానంలో ఉంది. తర్వాత ఏప్రిల్‌ 2009లో టెక్‌ మహీంద్రా కొనుగోలు చేసి దాన్ని మహీంద్రా సత్యంగా పేరు మార్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా సత్యం రామలింగరాజు, ఆయన భార్య, కుమారుడు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద, రాజుకు చెందిన సన్నిహిత బంధువుల పేర్లమీద దేశంలోని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ముంబాయి, బెంగుళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, పూణే, నాగపూర్‌, ప్రాంతాలలో ఉన్న దాదాపు వెయ్యికోట్లరూపాయలకు పెైగా విలువచేసే స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి సీబీఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది. దేశంలో మొత్తం 123 ప్రాంతాలలో రాజు ఆయన సంబంధీకులకు ఈ ఆస్తులు ఉన్నట్లు సీబీఐ కొద్దిరోజుల క్రితమే కోర్టుకు తెలియజేసింది. కేసు విచారణ తుదిదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+