డెక్కన్ ఛార్జర్స్ రద్దుపై సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించిన డీసీహెచ్‌ఎల్

ఈ నెల 13న ఆర్బిట్రేటర్ స్టేటస్ కో ఇచ్చిన ఆదేశాలను బిసిసిఐ సవాల్ చేయగా.. హైకోర్టు తోసిపుచ్చడంతో డెక్కన్ ఛార్జర్స్ రద్దు అమల్లోనే ఉన్నట్లైంది. ఐతే ప్రాంఛైజీని రద్దు చేస్తూ బిసిసిఐ తీసుకున్న నిర్ణయంలో చట్టబద్దత, దాని కాలపరిమితిని ఆర్బిట్రేటర్ నిర్ణయించవచ్చని బాంబై హైకోర్టు తెలిపింది. అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ. 100 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్ఫణకు డీసీహెచ్ ఎల్ గడువును(అక్టోబర్ 12న) పొడిగించడానికి బాంబై హైకోర్టు అంగీకరించ లేదు. అక్టోబర్ 12న స్టేటస్ కో విధించే అధికారం ఆర్బిట్రేటర్ లేదంటూ జస్టిస్ ధనూకా తెలిపారు.
ఆర్బిట్రేటర్ హైకోర్టు కంటే ఉన్నతమైనది కాదు. కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరించేలా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఒకసారి హైకోర్టు తిరస్కరించిన తర్వాత అదే విషయాలను ఆర్బిట్రేటర్ ముందు ఉంచిన పిటిషన్‌ను తప్పుబట్టారు. అక్టోబర్ 1న బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని ఆదేశించిన మరో న్యాయమూర్తి ఉత్తర్వులు, డీసీహెచ్‌ఎల్, బిసిసిఐ సంస్దల ప్రయోజనాలను కాపాడే విధంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. గడువు తీరిన తర్వాత కూడా డీసీహెచ్‌ఎల్ బ్యాంకు గ్యారంటీని సమర్పించలేదు కాబట్టి ఆ సంస్దకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇది ఇలావుండగా, 2008లో హైదరాబాద్ ఫ్రాంచైజీని రూ.428 కోట్లకు కొనుగోలు చేసిన డీసీహెచ్‌ఎల్... కొంతకాలంగా తమ ఆటగాళ్లు, కోచ్‌లకు బకాయిలు చెల్లించకపోవడంతో వివాదం ప్రారంభమైంది. ఆ వివాదం కాస్తా డెక్కన్ చార్జర్స్‌ను రద్దు చేసే వరకూ వెళ్లింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications