న్యూఢిల్లీ: పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకోని దేశపు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ, ఆటో రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను సగానికి సగం తగ్గించింది. ఈ పండుగ ఆఫర్ అక్టోబర్ 17 నుండి డిసెంబర్ 31 మధ్య తీసుకునే రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ఎస్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్‌బీఐతో పాటు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు కూడా పండుగ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుండి మొదలయ్యే ఈ పండుగ సీజన్‌లో తీసుకునే రుణాలకు, వాహనాలకు గరిష్ట పరిమితి ఉండదు. అదే విధంగా ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉందని స్పష్టం చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గతంలో రూ. 25 లక్షలలోపు గృహరుణాలపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును 0.25 శాతం నుండి 0.125 శాతానికి తగ్గించింది. ఈ కొత్త ఛార్జీల ప్రకారం రూ. 25 లక్షల రుణం తీసుకుంటే రూ. 3,125 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అదే రూ. 25 లక్షల నుండి రూ. 75 లక్షలలోపు గృహరుణంపై ఇప్పుడున్న ఛార్జీ రూ. 6,500 నుండి రూ. 3,250కి, ఆ పై మొత్తానికి తీసుకునే గృహరుణంపై రూ. 10,000 నుండి రూ. 5,000కి తగ్గించింది.
ఆటో లోన్స్ విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజుని 0.51 శాతం నుండి 0.255 శాతానికి తగ్గించింది. ఐతే సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా ఎత్తివేశాయి. అన్ని బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేటు తక్కువగా 9.75 శాతం ఉండగా, ఇతర బ్యాంకుల బ్యాంకుల బేస్ రేటు 10 నుండి 10.50 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణాలను 10.25 శాతానికి ఇస్తూ తక్కువ వడ్డీరేట్లలో రెండో స్థానంలో ఉంటే... ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10.40 శాతం రేటుతో మూడో స్థానంలో ఉంది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
ఎస్‌బీఐ ఫెస్టివల్ ఆఫర్: గృహ, ఆటో రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలు తగ్గింపు | SBI rings in festival season by cutting loan processing fee | ఎస్‌బీఐ ఫెస్టివల్ ఆఫర్: ప్రాసెసింగ్ ఛార్జీలు తగ్గింపు
State Bank of India has reduced processing fee by up to 50 percent on home and auto loans availed until 31 December, 2012. With this offer, the bank now offers the cheapest processing fees on both home and auto loans, as compared to other banks.
Story first published: Thursday, October 18, 2012, 12:41 [IST]
Other articles published on
Oct 18, 2012