
2007 డిసెంబర్ నుండి దాదాపు ఐదేళ్లపాటు సిటీ గ్రూప్‌నకు విక్రమ్ పండిట్ సేవలందించారు. 2008లో ప్రపంచ ఆర్దిక సంక్షోభం నుండి కొనసాగుతున్న అనిశ్చిత పరిస్దితుల్లో సిటీ గ్రూప్ బ్యాంకింగ్ వ్యవస్దను ముందుండి నడిపించారు. ఇది ఇలా ఉంటే కంపెనీ ప్రెసిడెంట్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) జాన్ హవెన్స్ కూడా రాజీనామా చేశారు. వీరిద్దరూ ఇలా సడన్‌గా తమ తమ బాధ్యతల నుండి వైదొలగడానికి గల కారణాలను మాత్రం సిటీ గ్రూప్ వెల్లడించ లేదు. తీవ్ర ఆర్దిక సంక్షోభంలో సిటీ బ్యాంక్ సీఈఓగా బాధ్యతలను తీసుకున్న విక్రమ్ పండిట్ 2009, 2010 సంవత్సరాల్లో బ్యాంకును నష్టాల నుండి గట్టెక్కించేందుకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోన్నారు.
ఈ సందర్బంలో సిటీ బ్యాంక్ లాభాల్లోకి వచ్చేదాకా ఏడాదికి ఒక్క డాలర్ వేతనాన్ని మాత్రమే తీసుకుంటానని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సంస్ద లాభాల్లోకి రావడంతో భారీ మొత్తంలో ప్యాకేజీని తీసుకున్నారు. ఆర్దిక సంక్షోభం నుండి మళ్లీ పటిష్టమైన ఫైనాన్షియల్ సంస్దగా సిటీ గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా పుంజుకుందని సంస్ద పగ్గాలను మరొకరెవరైనా చేపట్టేందుకు ఇదే సరైన సమయంగా భావించి తన రాజీనామాని సమర్పించానని విక్రమ్ పండిట్ తెలిపారు. కొత్త సీఈఓగా బాధ్యతలను చేపట్టిన మైఖెల్ కార్బెట్ భవిష్యత్తులో రాబోయే సవాళ్లను దీటుగా ఎదుర్కోనగల వ్యక్తిగా అభివర్ణించాడు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications