కింగ్‌ఫిషర్ లాకౌట్: ఉద్యోగులతో ఈరోజు(Oct 17) యాజమాన్యం చర్చలు

అంతక ముందు సెప్టెంబర్ 28న పాక్షిక లాకౌట్‌ని ప్రకటించి.. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖు వరకూ సేవలను రద్దు చేసింది. ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో దీనిని అక్టోబర్ 12 వరకూ పొడిగించి.. మళ్లీ లాకౌట్‌ను ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లెైన్స్ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాలంటే పౌర విమాన యానశాఖ డెైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. కేవలం డబ్బే కాదు... ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి యధావిధిగా విమాన సర్వీసులు పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని పౌర విమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్ అన్నారు.
ఇటీవలే డీజీసీఏ కింగ్‌ఫిషర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కి విమానయాన రంగ నియంత్రణ సంస్ద డీజీసీఏ (డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిన్న (శుక్రవారం) షోకాజ్ నోటీసు జారీ చేసింది. సురక్షితమైన, విశ్వసనీయమైన సర్వీసులు అందించడంలో విఫలమైనందున లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో కోరుతూ 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. గత 10 నెలలుగా షెడ్యూల్‌ను పాటించకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ మిశ్రా పేర్కోన్నారు.
అక్టోబర్ 4 (గురువారం) నాడు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన గ్రౌండెడ్ ఎయిర్ లైన్ ఇంజనీర్ మానస్ చక్రవర్తి భార్య సుష్మితా చక్రవర్తి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్తకు ఏడు నెలలుగా వేతనం చెల్లించకపోవడం వల్ల ఆర్దిక ఒత్తిడికి గురై ఆత్మహాత్య చేసుకంటున్నట్లు న్యూఢిల్లీ కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఉద్యోగి భార్య సుష్మితా చక్రవర్తి తెలిపారు. 45 సంవత్సరాల వయసు కలిగిన సుష్మితా చక్రవర్తి బెంగాలీలో తన చావుకి గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్‌ను రాసింది. తన సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరూ బాధ్యులు కారంటూ రాయడం గమనార్హం. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దీంతో అక్టోబర్ 8 (సోమవారం) నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో మాల్యాకి వ్యతిరేకంగా హృదయపూర్వక విజ్ఞప్తి నమోదు చేయబడింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications