
అంతక ముందు అక్టోబర్ 13 (శనివారం) నుండి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో విమానయాన నియంత్రణ సంస్ద డీజీసీఏ టిక్కెట్ల విక్రయాలను ఆపివేయాలని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇటీవల సెప్టెంబర్ 28న పాక్షిక లాకౌట్‌ని ప్రకటించి.. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖు వరకూ సేవలను రద్దు చేసింది. ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో దీనిని అక్టోబర్ 12 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.
దీంతో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే విమాన సర్వీసుల కోసం టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. ఉద్యోగుల వేతన బకాయిల కోసం రూ. 60 కోట్లు విడుదల చేశామని బ్యాంకులు చెప్పగా, ఇంతవరకూ తామెలాంటి వేతనాలు అందుకోలేదని ఉద్యోగులు వాపోయారు. మరోవైపు నిన్న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కంపెనీ యాజమాన్యం తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఏడు నెలల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకోని నిరసన ప్రదర్శన నిర్వహించారు. చర్చలు జరపడానికి ఉద్యోగులు సిద్దంగా ఉన్నప్పటికీ.. యాజమాన్యం నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని, కొద్ది రోజుల్లో భవిష్యత్ కార్యచరణను తెలుపుతామని అన్నారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లెైన్స్ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాలంటే పౌర విమాన యానశాఖ డెైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. కేవలం డబ్బే కాదు... ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి యధావిధిగా విమాన సర్వీసులు పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని పౌర విమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్ అన్నారు. దీంతో కింగ్‌ఫిషర్ పాక్షికంగా లాకౌట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె ప్రభావాలను కూడా డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications