
ఐతే వి. బాలకృష్ణన్ మాత్రం కంపెనీ బోర్డులో సభ్యునిగా కొనసాగుతారు. సబ్సిడరీ ఇన్సోసిస్ బీపీఓ, ఫినకిల్, ఇండియా బిజినెస్ యూనిట్లకు హెడ్‌గా వ్యవహరించనున్నారని ఇన్సోసిస్ పేర్కోంది. ప్రస్తుతం కంపెనీ సీఈఓ, ఎండీగా ఉన్న ఎస్ డి శిబులాల్ స్దానాన్ని భవిష్యత్తులో చేపట్టే సామర్ద్యం ఉన్న వ్యక్తిగా ప్రచారంలో ఉన్న బాలకృష్ణన్‌ను ఆకస్మాత్తుగా కీలక బాధ్యతల నుండి తప్పించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణన్ ఒక్కరే రేసులో ఉన్నారనుకుంటే పొరపాటే. బోర్డు సభ్యుడు, ఇన్సోసిస్ ఐరోపా వ్యాపారం, ఆర్దిక సేవల, బీమా విభాగ గ్లోబల్ హెడ్ అయిన బి.జి. శ్రీనివాసన్ కూడా ఉన్నారు.
మీరు సీఎఫ్‌ఓగా వైదొలుగుతానంటూ మార్కెట్‌కు షాక్ ఇచ్చారెందుకన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఇది షాక్ కాదు. యువతకు ప్రాధన్యమివ్వాలనే సంప్రాదాయాన్ని పాటించాం. రాజీవ్ బన్సల్ యువకుడే కాక మంచి వ్యక్తి. అందుకే అతనికి అవకాశం ఇచ్చాం. అయినా నేను బీపీఓ, ఫినాకిల్, ఇండియా బిజినెస్ విభాగాలను చూసుకుంటానని బాలకృష్ణన్ వివరించారు.
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల వేతనాలను 6 శాతం మేర పెంచుతున్నట్లు ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఆఫ్‌షోర్ సిబ్బందికి సగటున 6 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెరుగుదల ఉంటుందని ఇన్ఫీ సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ చెప్పారు. అక్టోబర్ 1 నుంచి ఆఫ్‌షోర్ ఉద్యోగులకు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆన్‌సైట్ సిబ్బందికి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇదిలాఉండగా, క్యూ2లో కంపెనీలో స్థూలంగా 10,420 మంది కొత్త ఉద్యోగులు చేరారు.
ఇతర కంపెనీలకు వలసవెళ్లిన వారిని తీసేస్తే నికరంగా 2,610 మంది జతయ్యారు. దీంతో సెప్టెంబర్ 30 నాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,53,761 మందికి చేరింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 35 వేల మందిని ఇన్ఫోసిస్‌లో, 13 వేల మందిని సబ్సిడరీ సంస్థ ‘ఇన్ఫోసిస్ బీపీఓ'లో చేర్చుకోగలమని అంచనా వేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications