నిరాశపర్చిన ఇన్సోసిస్ Q2 ఫలితాలు, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర లాభం 3.5 శాతం పెరిగి రూ. 2,369 కోట్లకు చేరుకుంది. నికర లాభంలో అనలిస్టుల అంచనాలను కొద్దిగా అధిగమించినప్పటికీ ఆదాయంలో మాత్రం వెనుకబడిపోయింది. ఈ ఆర్దిక సంవత్సరానికి మొత్తం ఈపీఎస్ గైడెన్స్‌ను 166 నుండి 160 రూపాయలకు తగ్గించింది. దీంతో ఇన్పోసిస్ షేరు ధర 7 శాతానికి పైగా నష్టపోతూ రూ. 2,340 సమీపంలో ట్రేడవుతోంది. గత ఐదు క్వార్టర్ల నుండి ఇన్పోసిస్ ఆర్దిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరుస్తానే ఉన్నాయి.
ఇన్పోసిస్ మార్చి 2013 నాటికి డాలర్ ఆదాయం $7.343బిలియన్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇది మార్కెట్ అంచనాలకు కేవలం 5శాతం తక్కువ. దీంతో శుక్రవారం స్టాక్స్ 8 శాతం డౌన్ ట్రేడింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 55 పాయింట్ల దాకా నష్టపోతూ 18, 748 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా... నిప్టీ 16 పాయింట్ల దాకా నష్టపోతూ 5,691 పాయింట్ల సమీపంలో ట్రేడ్ అవుతుంది.
ఇన్సోసిస్ ఫలితాల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ డి శిభులాల్ మాట్లడాతూ ఇన్సోసిస్ ఫలితాలు ఈ విధంగా ఉండడానికి కారణం గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులేనని అన్నారు. ఉద్యోగుల వేతనాలు పెరగడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సోల్యుషన్స్ కోసం నిధులు ఎక్కువగా కేటాయించామని అన్నారు. మేము తీసుకున్న ఈ నిర్ణయాలు రాబోయే కాలంలో కంపెనీ పురోగతికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications