ద్రవ్యలోటుని నియంత్రించండి, లేకపోతే చెత్త రేటింగ్: స్టాండర్డ్ అండ్ పూర్స్

ప్రస్తుతం భారత్ రేటింగ్ బీబీబీ (నెగెటివ్)గా ఉంది. అంటే తక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చే దేశానికి ఇచ్చే రేటింగ్ అన్నమాట. ఒక వేళ దీని కంటే మరింత తక్కువకు దిగజారితే జంక్ స్టేటస్ అంటారు. జంక్ స్టేటస్ అంటే చెత్తరేటింగ్ అని అర్ధం. ఈ రేటింగ్ గనుక భారత్‌కు వస్తే భారత్‌కు చెందిన కార్పొరేట్లు విదేశాల నుంచి తెచ్చుకునే రుణాలకు చాలా ఖరీదెైన వ్యవహారంగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో పాటు దేశంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే... పరిస్థితి మరింత దిగజారుతుందని ఇన్వెస్టర్లలో విశ్వాసం పోతుందని తమ అభిప్రాయమని స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) వివరించింది.
ఎస్ అండ్ పీ అంచనా ప్రకారం దేశంలో రాజకీయ వాతావరణం సరిగా లేనందు వల్ల సంస్కరణలు మందగమనంలో సాగుతున్నాయని ఎస్ అండ్ పీ ఒక నివేదికలో పేర్కొంది. వృద్ది రేటు అంచనాలు మరింత సన్నగిల్లడం, అంతర్జాతీయంగా ఆర్దిక అనిశ్చితి ఎగబాకడం, దేశంలో రాజకీయ పరిస్దితులు దుర్బంగా మారడం, సంస్కరణల మందగమనం వంటివి డౌన్ గ్రేడ్‌కు దారితీయవచ్చునని ఎస్ అండ్ పీ పేర్కోంది.
డౌన్ గ్రేడ్ నుండి తప్పించుకోవడం ఎలా..?
* ద్రవ్య లోటును నియంత్రించే చర్యలు చేపట్టడం
* పెట్టుబడులు వాతావరణాన్ని మెరుగుపరచే ప్రయత్నాలు చేయడం
* దేశ ఆర్దిక వ్వవస్ద అధిక వృద్ది సాధించే అవకాశాలు కల్పించడం
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications