నిబంధనలు ఉల్లంఘించి టిక్కెట్లు అమ్ముతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్
న్యూఢిల్లీ: అక్టోబర్ 13 (శుక్రవారం) నుండి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో విమానయాన నియంత్రణ సంస్ద డీజీసీఏ టిక్కెట్ల విక్రయాలను ఆపివేయాలని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇటీవల సెప్టెంబర్ 28న పాక్షిక లాకౌట్‌ని ప్రకటించి.. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖు వరకూ సేవలను రద్దు చేసింది. ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో దీనిని అక్టోబర్ 12 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

దీంతో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే విమాన సర్వీసుల కోసం టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. ఉద్యోగుల వేతన బకాయిల కోసం రూ. 60 కోట్లు విడుదల చేశామని బ్యాంకులు చెప్పగా, ఇంతవరకూ తామెలాంటి వేతనాలు అందుకోలేదని ఉద్యోగులు వాపోయారు. మరోవైపు నిన్న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కంపెనీ యాజమాన్యం తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఏడు నెలల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకోని నిరసన ప్రదర్శన నిర్వహించారు. చర్చలు జరపడానికి ఉద్యోగులు సిద్దంగా ఉన్నప్పటికీ.. యాజమాన్యం నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని, కొద్ది రోజుల్లో భవిష్యత్ కార్యచరణను తెలుపుతామని అన్నారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లెైన్స్ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాలంటే పౌర విమాన యానశాఖ డెైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. కేవలం డబ్బే కాదు... ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి యధావిధిగా విమాన సర్వీసులు పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని పౌర విమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్ అన్నారు. దీంతో కింగ్‌ఫిషర్ పాక్షికంగా లాకౌట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె ప్రభావాలను కూడా డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తెలిపారు.
డీజీసీఏ కింగ్‌ఫిషర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారి నుంచి ఖచ్చితమైన జవాబు రావాల్సి ఉందని కేవలం పెట్టు బడులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తామంటే సరిపోదని... ఖచ్చితమైన ప్రణాళికను తయారు చేసి ముందుకు రావాలని ఉద్యోగులకు వేత నాలు ఎలా చెల్లిస్తారు ఎయిర్‌లెైన్స్ నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారనే విషయంపై స్పష్టత రావాలన్నారు.
ఎయిర్‌లెైన్స్ గాడిలో పడుతుందన్న ఆశతో ఉద్యోగాలు పనిచేశారని ప్రస్తుతం పరిస్థితి చూ స్తుంటే వారి ఆశలు నిరాశయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అయితే పరిశ్రమ నిపుణులు మాత్రం షోకాజ్ నోటీసు నాలుగు నెలల క్రితం ఇస్తే పరిస్థితి ఇంతగా దిగజారే దికాదని అంటున్నారు. ఇండియన్ కమర్షియల్ పెైలట్స్ అసోసియేషన్ సింగ్‌కు ఒక లేఖ రాస్తూ... కింగ్‌ఫిషర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య దురదృష్ట సంఘటన అనీ.. ఇదే పరిస్థితి ఎయిర్ ఇండియాలో పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదని లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications