
నిన్న ప్రారంభమైన ఎకనమిక్ ఎడిటర్ల సదస్సు-2012ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్న రూ. 30 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను ఆరంభించనున్నట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఉన్న కంపెనీల ఆఫర్ లు 6 నెలల్లో రానున్నాయని.. తొలి ఇష్యూ ఆర్ ఐఎన్ఎల్‌దేనని ఆయన చెప్పారు.
రూపాయి బలపడడం ఎంతో ముఖ్యం:
డాలరుతో రూపాయి మారకం విలువ తిరిగి బలం పుంజుకుంటుండటం ఆర్థిక వ్యవస్థకు ఎంతో సానుకూలాంశం. దీనివల్ల ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల దిగుమతుల వ్యయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం పెరగకుండా కూడా దోహదపడుతుంది. రూపాయి విలువ పతనం వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. దిగుమతుల విలువను రూపాయి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల దీని స్థిరీకరణ చాలా అవసరం. ఈ విషయంలో ప్రభుత్వం కొంత సఫలీకృతమైందని భావిస్తున్నానని అన్నారు.
సబ్సిడీలు అన్నీ ఎత్తివేయం:
సబ్సిడీలు అమలు చేయలేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని కేల్కర్ కమిటీ తన నివేదికలో పేర్కొందని చిదంబరం గుర్తు చేశారు. కేల్కర్ నివేదికను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి సమయం ఆసన్నమైందని. అయితే రాజకీయ.. ఆర్థిక కారణాల రీత్యా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ... కారణాలు ఏమైనా ప్రస్తుతం ఏం చేయాలి.. వచ్చే ఏడాది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి... వీటన్నిటి క్రోడీకరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సబ్సిడీల ఎత్తివేత గురించి ప్రస్తావిస్తూ... ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయినా.. ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ.5 లు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై ప్రతి కుటుంబానికి ఆరు సిలిండర్లకు పరిమితం చేసిందని ఆయన వివరించారు.
ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు:
ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి తగిన చర్యలను తీసుకుంటామని చిదంబరం హామీనిచ్చారు. ఆర్‌బీఐతో సమన్వయం ద్వారా ధరలు పెరగకుండా చూస్తామన్నారు. పొదుపు, పెట్టుబడుల ఆసరాతో మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మళ్లీ 8 శాతానికి కోలుకుంటుందని, 9 శాతాన్ని సైతం మళ్లీ తాకుతుందనే విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 2011-12లో తొమ్మిది సంవత్సరాల కనిష్ఠానికి 6.5 శాతానికి పడిపోయిందని.. గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో వృద్ధిరేటు కేవలం 5.5 శాతానికి పరిమితం అయిందని ఆయన గుర్తు చేశారు.
సంస్కరణలకు అడ్డుపడొద్దు:
కీలకమైన ఆర్థిక సంస్కరణలను గనుక ముందుకు తీసుకెళ్లకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రంగా దిగజారిపోయే ముప్పు పొంచి ఉంటుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఎకానమీని గాడిలోపెట్టేందుకు తగిన విధానాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతిపక్షాలు సంస్కరణలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసమే కానీ, అడ్డుపడటం మాత్రం తగదని అన్నారు. మల్టీ బ్రాండ్ రీటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకుంటామని ప్రతిపక్షాలు హెచ్చరిండం గురించి ప్రస్తావిస్తూ.... భారత్ ఆర్థిక వ్యవస్థ అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. సంస్కరణలను అమలు చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని, ఇంత పెద్ద దేశంలో పెద్ద ఎత్తున ఉన్న జనాభాకు ఉద్యోగాలు కల్పించలేమని అన్నారు. శీతాకాల సమావేశాలకు ముందే బీజీపీతో పాటు ప్రతిపక్షపార్టీలతో సంప్రదింపులు జరిపి మల్టీ బ్రాండ్ రీటెయిల్‌రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంచేందుకు సహకరించాల్సిందిగా కోరతామని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications