
బ్యాంకు గ్యారెంటీని గడువులోగా సమర్పించకపోతే తీర్పు బీసీసీఐకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గ్యారెంటీ సమర్పిస్తే ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా వివాదాన్ని కోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది. కాగా, అక్టోబర్ 31లోగా ఐపీఎల్-5కు బకాయిపడ్డ మొత్తం సొమ్మును కూడా చెల్లించాల్సిందేనని డెక్కన్ ఛార్జర్స్‌కి హైకోర్టు సూచించింది.
డీసీహెచ్‌ఎల్‌కు సుమారు రూ.5,000 కోట్ల రుణాలు మంజూరు చేసిన 20కి పైగా బ్యాంకులు అందులో మెజార్టీ వాటాను మాఫీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రుణాల కోసం డీసీ సమర్పించిన పూచీకత్తు ఆస్తుల (కొల్లేటరల్ సెక్యూరిటీ) విలువపై ఉన్న అనుమానాలే ఇందుకు కారణం. డెక్కన్ ఛార్జర్స్‌పై ప్రస్తుతం జరుగుతున్న విచారణ కూడా నత్తనడక సాగుతుండటంతో తామిచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని రైటాఫ్ చేసుకొనే దిశగా బ్యాంకులు రంగం సిద్ధం చేసుకొంటున్నాయని బ్యాంకింగ్ వర్గాల సమాచారం.
సుమారు రూ.3,000 కోట్ల రుణాలు ఈ జాబితాలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే జూలై-సెప్టెంబర్(క్యూ2)లో ఆయా బ్యాంకుల ఎన్‌పీఏల రేటు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఒక్క డెక్కన్ చార్జర్స్‌కు మాత్రం దాదాపు రూ.1,000 కోట్ల విలువ వచ్చే అవకాశం ఉందని బ్యాంకులు నమ్మకంగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు డీసీహెచ్‌ఎల్ ప్రతిపాదిస్తున్న కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్) ప్యాకేజీపై మెజార్టీ బ్యాంకులు ఆసక్తి కనబరచడం లేదు.
ఇది ఇలా ఉంటే డెక్కన్ ఛార్జర్స్ చెల్లించనున్న రూ. 100 కోట్లు తిరిగి తీసుకోలేని విధంగా, ఎటువంటి షరతులు లేకండా సమర్పించాలని ఆదేశించింది. ఈ బ్యాంకు గ్యారెంటీ ఒక ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటుందని కేసును విచారిస్తున్న జస్టిస్ ఎస్.జె.కఠావాలా పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)-6కు సంబంధించి అన్ని రకాల వ్యయాలను డెక్కన్ క్రానికల్ భరించాలని కోర్టు తెలిపింది. బీసీసీఐకి ఫ్రాంచైజీ చెల్లింపులు సహా ఆటగాళ్ల వేతనాలు, సపోర్టింగ్ బృంద ఖర్చులు పెట్టుకోవాలని కూడా సూచించింది. మ్యాచ్‌ల నిర్వహణతో పాటు ఇతర వ్యయాలనూ డెక్కన్ ఛార్జర్స్ భరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్-5కు సంబంధించిన వివాదరహిత హోటల్ బిల్లులు, రవాణా ఖర్చులను అక్టోబర్ 31లోగా చెల్లించాలని తెలిపింది. ఇందులో డీసీహెచ్‌ఎల్ విఫలమైతే.. తనకు తగిన అవసరం మేరకు బ్యాంకు గ్యారెంటీని నగదుగా మార్చుకొనేందుకు బీసీసీఐకి అధికారం ఉంటుందని జస్టిస్ కఠావాలా పేర్కొన్నారు. కాగా, తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ.. 7 రోజుల వరకు ఫ్రాంచైజీ రద్దు దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐని కోరారు.
ఐతే, తమ తీర్పు ఐపీఎల్-6కు సంబంధించి కొత్త ఫ్రాంచైజీని ఎంపిక చేసుకొనేందుకు బీసీసీఐకి ఆటంకం కాదని న్యాయమూర్తి వివరించారు. కాగా, ఫ్రాంచైజీ రద్దు కేసును 3 నెలల్లోగా ఉభయ వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సి.కె.థక్కర్‌ను మధ్యవర్తి (ఆర్బిట్రేటర్)గా నియమించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications