
అక్టోబర్ 4 (గురువారం) నాడు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన గ్రౌండెడ్ ఎయిర్ లైన్ ఇంజనీర్ మానస్ చక్రవర్తి భార్య సుష్మితా చక్రవర్తి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్తకు ఏడు నెలలుగా వేతనం చెల్లించకపోవడం వల్ల ఆర్దిక ఒత్తిడికి గురై ఆత్మహాత్య చేసుకంటున్నట్లు న్యూఢిల్లీ కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఉద్యోగి భార్య సుష్మితా చక్రవర్తి తెలిపారు. 45 సంవత్సరాల వయసు కలిగిన సుష్మితా చక్రవర్తి బెంగాలీలో తన చావుకి గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్‌ను రాసింది. తన సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరూ బాధ్యులు కారంటూ రాయడం గమనార్హం. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
ఇక కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కి విమానయాన రంగ నియంత్రణ సంస్ద డీజీసీఏ (డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిన్న (శుక్రవారం) షోకాజ్ నోటీసు జారీ చేసింది. సురక్షితమైన, విశ్వసనీయమైన సర్వీసులు అందించడంలో విఫలమైనందున లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో కోరుతూ 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. గత 10 నెలలుగా షెడ్యూల్‌ను పాటించకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ మిశ్రా పేర్కోన్నారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇటీవల సెప్టెంబర్ 28న పాక్షిక లాకౌట్‌ని ప్రకటించి.. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖు వరకూ సేవలను రద్దు చేసింది. ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో దీనిని అక్టోబర్ 12 వరకూ పొడిగించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లెైన్స్ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాలంటే పౌర విమాన యానశాఖ డెైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి. కేవలం డబ్బే కాదు... ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి యధావిధిగా విమాన సర్వీసులు పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని పౌర విమానయానశాఖ మంత్రి అజిత్‌సింగ్ అన్నారు. దీంతో కింగ్‌ఫిషర్ పాక్షికంగా లాకౌట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె ప్రభావాలను కూడా డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తెలిపారు.
డీజీసీఏ కింగ్‌ఫిషర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారి నుంచి ఖచ్చితమైన జవాబు రావాల్సి ఉందని కేవలం పెట్టు బడులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తామంటే సరిపోదని... ఖచ్చితమైన ప్రణాళికను తయారు చేసి ముందుకు రావాలని ఉద్యోగులకు వేత నాలు ఎలా చెల్లిస్తారు ఎయిర్‌లెైన్స్ నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారనే విషయంపై స్పష్టత రావాలన్నారు.
ఎయిర్‌లెైన్స్ గాడిలో పడుతుందన్న ఆశతో ఉద్యోగాలు పనిచేశారని ప్రస్తుతం పరిస్థితి చూ స్తుంటే వారి ఆశలు నిరాశయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అయితే పరిశ్రమ నిపుణులు మాత్రం షోకాజ్ నోటీసు నాలుగు నెలల క్రితం ఇస్తే పరిస్థితి ఇంతగా దిగజారే దికాదని అంటున్నారు. ఇండియన్ కమర్షియల్ పెైలట్స్ అసోసియేషన్ సింగ్‌కు ఒక లేఖ రాస్తూ... కింగ్‌ఫిషర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య దురదృష్ట సంఘటన అనీ.. ఇదే పరిస్థితి ఎయిర్ ఇండియాలో పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదని లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications