
కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇటీవల సెప్టెంబర్ 28న పాక్షిక లాకౌట్‌ని ప్రకటించి.. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖు వరకూ సేవలను రద్దు చేసింది. ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య చర్చలు విఫలం కావడంతో దీనిని అక్టోబర్ 12 వరకూ పొడిగించింది. దీంతో కింగ్‌ఫిషర్ పాక్షికంగా లాకౌట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల సమ్మె ప్రభావాలను కూడా డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తెలిపారు.
ఇది ఇలా ఉంటే మానవత దృక్పధంతో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు నిధులు సమకూర్చాలని బ్యాంకులు నిర్ణయించాయి. గత ఏడు నెలలుగా వేతనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నందున ఎస్కో అకౌంట్ల నుండి కింగ్‌ఫిషర్‌కు నిధులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ప్రతీప్ చౌధరి తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీకి రూ.60 కోట్ల వరకూ సమకూరే అవకాశం ఉంది. ఉద్యోగులు వేతనాలు చెల్లించడానికి వీటిని వినియోగించే అవకాశం ఉంది. కింగ్‌ఫిషర్ చైర్మన్ విజయ్ మాల్యా కొత్త ఇన్వెస్టర్ వెతుకులాట కోసం బ్యాంకులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
కింగ్‌ఫిషర్ చెల్లించాల్సిన రూ. 1,580 కోట్ల రుణాలను ఎస్‌బీఐ ఇప్పటికే నిరర్థక ఆస్తిగా వర్గీకరించింది. బ్యాంకులకు కింగ్‌ఫిషర్ దాదాపు రూ. 7,000 కోట్ల మేర రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. డీజీసీఏ నోటీసుపై స్పందిస్తూ.. తాము గడువులోగా వివరణ పంపుతామని కింగ్‌ఫిషర్ తెలిపింది. అలాగే, ఉద్యోగులతో చర్చలు జరిపిన తర్వాత సర్వీసుల పునరుద్ధరణపై సమగ్ర ప్రణాళిక సమర్పిస్తామని వివరించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications