బీమా రంగానికి భారీ పెట్టుబడులు అవసరం: ఐఆర్‌డీఏ ఛైర్మన్ హరి నారాయణ

బీమా రంగానికి ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుందని, లేకపోతే ఇన్సూరెన్స్ రంగానికి అవసరమైన పెట్టుబడులు మన దగ్గర లేవని ఆయన అన్నారు. ఈ రంగం రెండింతలు కావాలంటే వచ్చే ఐదేళ్లలో మనకు కనీసం 30వేల కోట్లు కావాలన్నారు. సంస్కరణల అజెండాకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం పెన్షన్ నిధులలోకి కూడా ఎఫ్‌డిఐలను పెంచుతూ, ఇన్స్యూరెన్స్ రంగంలో 49శాతం మేరకు పెంచిన విషయం తెలిసిందే. ఐఆర్‌డిఎ ప్రకారం జిడిపిలో ఇన్య్సూరెన్స్ రంగంలో 4.5 శాతముంటుంది. గత సంవత్సరం వసూలు చేసిన మొత్తం ప్రీమియమ్ రూ.2.83 లక్షల కోట్లు. ఎఫ్‌డిఐ పరిమితిని పెంచడంతో, జిడిపికి ఇన్స్యూరెన్స్ రంగం తోడ్పాటు కూడా పెరుగుతుందని హరి నారాయణ చెప్పారు.
దాదాపు 21 ప్రైవేటు, నాలుగు ప్రభుత్వ రంగ బీమా సంస్థలతో కూడిన ఇన్స్యూరెన్స్ రంగం ప్రీమియం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లో రూ.27,942 కోట్లుగా ఉంది. ఇది 2011-12 సంవత్సరంలో వచ్చిన రూ.23,748 కోట్లకన్నా 18శాతం అధికం. అయితే, గత సంవత్సరం తొలి ఐదు నెలల్లో వచ్చిన రూ.40,654 కోట్లతో పోలిస్తే జీవిత బీమా పరిశ్రమ ఈ ఏడాది 15 శాతం తగ్గి రూ.34,358కోట్లుగా ఉంది. ఇది ఇలా ఉంటే బీమా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు వీలుగా నియమ నిబంధనలు రూపొందించే పనిలో గత కొంత కాలంగా ఐఆర్‌డీఏ నిమగ్నమైన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications