సాంకేతికలోపం ట్రేడింగ్ నిలిపివేత.. 13 ని తర్వాత మళ్లీ పునః ప్రారంభం

ఇక సెన్సెక్స్ 113 పాయింట్ల దాకా కోల్పోతూ 18, 944 పాయింట్లకి సమీపంలో ట్రేడవుతోంది. ఆటో, ఎఫ్ ఎంసీజీ తప్పించి అన్ని సెక్టోరియల్ సూచీలు నష్టపోతున్నాయి. రియాల్టీ, పవర్, ఐటీ సూచీలు ఎక్కువగా కోల్పోతున్నాయి. గ్రూపు ఏలో ఒబెరాయ్ రియాల్టీ, హెచ్ డీఎఫ్‌సీ, అదాని పవర్, సెంట్రల్ బ్యాంకు, అరబిందో ఫార్మా పేర్లు 4 నుండి నాలుగున్నర శాతం పడుతూ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అదే సమయంలో గీతాంజలి జెమ్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, కోల్ ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు 1 నుండి రెండున్నర శాతం లాభపడుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. వడ్డీ రేట్లు స్దిరంగా ఉంచుతామని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రసిడెంట్ ప్రకటించారు. దీన్ని ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా తీసుకున్నారు. డౌజోన్స్ 0.59 శాతం పెరిగి 3,149 వద్ద ముగిసింది. యూరోప్ మార్కెట్లలో జర్మనీ సూచీ 0.23 శాతం పడగా ఫ్రాన్స్ సూచీ 0.14 శాతం నష్టపోయింది. బ్రిటన్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. జపాన్, హాంకాంగ్ సూచీలు అర శాతం దాకా లాభపడ్డాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications