ఏడు నెలలుగా జీతాలు లేవు.. కింగ్‌ఫిషర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య

సుష్మితా చక్రవర్తి భర్త మానస్ చక్రవర్తి కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో గ్రౌండెడ్ ఎయిర్ లైన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దీంతో కంపెనీ కార్యదర్శి భరత్ రాఘవన్ రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయినట్లు కింగ్‌పిషర్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపింది. సమ్మె చేస్తున్న పైలెట్లు కార్మిక న్యాయస్దానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏడు నెలల వేతన బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
మరోవైపు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ముందు రోజు అప్పుల్లో కూరుకుపోయి సిబ్బందికి జీతాలు కూడా చెల్లించక ఇబ్బందులు పడుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ త్వరలోనే ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించి విమానాలను నడుపుతామని తెలిపింది. ఇంజనీరింగ్ సిబ్బంది సమ్మె కారణంగా సోమవారం ఈ సంస్థ విమాన సర్వీసులు రద్దు కావడం, సోమవారం రాత్రి కంపెనీ పాక్షిక లాకౌట్‌ను ప్రకటించన విషయం తెలిసిందే. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అరుణ్ మిశ్రాతో కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ హితేష్ పటేల్‌లు మంగళవారం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో విదేశీ విమానయాన సంస్దలు పెట్టుబడులు పెట్టగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ ఆర్థిక సమస్యలను, తదుపరి రోజుల్లో తీసుకోబోయే చర్యలను డీజీసీఏకు వివరించామని అగర్వాల్ పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో పరిస్దితులు చక్కబడలగవని మేం విశ్వాసంతో ఉన్నాం. కార్యకలాపాల పునరుద్దరణపై అక్టోబరు 4న నిర్ణయం తీసుకుంటామని అగర్వాల్ అన్నారు. కంపెనీలోకి నిధులు రావడానికి మూడు నాలుగు నెలలు పట్టొచ్చని అగర్వాల్ అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications