కింగ్‌ఫిషర్ యాజమాన్యం, ఉద్యోగుల మధ్య చర్చలు విఫలం.. మరోసారి భేటీ

ఇది ఇలా ఉంటే కింగ్ ఫిషర్ వర్సన్ మాత్రం మరోలా ఉంది. ఒక నెల జీతం చెల్లించడానికి కింగ్ ఫిషర్ యాజమాన్యం ముందుకు వచ్చిందని, కంపెనీకి నిధులు లభించిన వెంటనే మిగిలిన ఆరు నెలల జీతాన్ని చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసిందని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సమ్మెను విరమింపజేసేందుకు గాను అన్ని విభాగాల ఉద్యోగులతో చర్చలు జరుపుతామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు కింగ్‌ఫిషర్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈరోజు మరోసారి న్యూడిల్లీలో కంపెనీ ఉద్యోగులతో యాజమాన్యం భేటీ కానుంది.
ముందు రోజు అప్పుల్లో కూరుకుపోయి సిబ్బందికి జీతాలు కూడా చెల్లించక ఇబ్బందులు పడుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ త్వరలోనే ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించి విమానాలను నడుపుతామని తెలిపింది. ఇంజనీరింగ్ సిబ్బంది సమ్మె కారణంగా సోమవారం ఈ సంస్థ విమాన సర్వీసులు రద్దు కావడం, సోమవారం రాత్రి కంపెనీ పాక్షిక లాకౌట్‌ను ప్రకటించన విషయం తెలిసిందే. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అరుణ్ మిశ్రాతో కంపెనీ సీఈవో సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ హితేష్ పటేల్‌లు మంగళవారం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో విదేశీ విమానయాన సంస్దలు పెట్టుబడులు పెట్టగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ ఆర్థిక సమస్యలను, తదుపరి రోజుల్లో తీసుకోబోయే చర్యలను డీజీసీఏకు వివరించామని అగర్వాల్ పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో పరిస్దితులు చక్కబడలగవని మేం విశ్వాసంతో ఉన్నాం. కార్యకలాపాల పునరుద్దరణపై అక్టోబరు 4న నిర్ణయం తీసుకుంటామని అగర్వాల్ అన్నారు. కంపెనీలోకి నిధులు రావడానికి మూడు నాలుగు నెలలు పట్టొచ్చని అగర్వాల్ అన్నారు.
గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులను బహిష్కరించిన నేపథ్యంలో ‘ఇంకా నేనూ వేతనాన్ని అందుకోలేదని అన్నారు. రూ.8,000 కోట్ల నష్టాల్లో ఉన్న కింగ్‌ఫిషర్ సంస్థకు మరో రూ.7,000 కోట్లకుపైగా రుణభారం కూడా ఉందని తెలిపారు. కొద్ది నెలల నుంచి పలు విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయని, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు బకాయిలు చెల్లించలేకపోతున్నామన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా 80 మంది పైలెట్లు, 270 మంది ఇంజనీర్లు అడపాదడపా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications