టెలికం రంగంలో 100 శాతానికి ఎఫ్‌డిఐ పరిమితిని పెంచాలి: దీపక్ పరేఖ్ కమిటీ

Deepak Parekh Panel
మౌలికరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలంటే విద్యుత్‌ ఛార్జీలతో పాటు రెైలు చార్జీలను పెంచాల్సిందేనని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెైర్మన్‌ దీపక్ పరేఖ్ కమిటీ సిఫారసు చేసింది. టెలికం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని సూచించింది. అలాగే నేచురల్ గ్యాస్ ధరను సైతం పెంచాలని పేర్కొంది.

దీని వల్ల 12వ పంచవర్ష ప్రణాళికలో (2012-17) లో దేశంలో మౌలికరంగంలో పెట్టుబడుల కోసం రూ.51.46 లక్షల కోట్ల వరకు ఆకర్షించవచ్చునని పేర్కొంది. 12 వ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేట్‌ పెట్టు బడులు 47 శాతం వరకు పెంచాలని నివేదికలో కోరింది. హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఈ మేరకు తమ నివేదికను నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సమర్పించింది.

12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక రంగంలో రూ. 51.46 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన విధానాలు సిఫార్సు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలికరంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వాటా 37.53% ఉండగా.. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇది 47 శాతానికి పెరుగుతుందని కమిటీ పేర్కొంది. విధానపరమైన ఆటంకాలను తొలగింపునకు వేగంగా చర్యలు తీసుకోకపోతే పెట్టుబడుల లక్ష్యాల సాధన సాధ్యం కాకపోవచ్చని వివరించింది.

రెైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, హైవేలు లాంటి ప్రాజెక్టులకు పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహించాలని కోరింది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడుల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందని లేదంటే ఈ రంగాలు నిలదొక్కుకోలేవని తెలిపింది.

రంగాల వారీగా దీపక్‌ ఫారిఖ్‌ సిఫార్సులు:

విద్యుత్: టారిఫ్‌లు క్రమబద్ధీకరించాలి. పెరుగుతున్న ఇంధన చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపాలి. ఎస్‌టీసీ/ఎంఎంటీసీ లేదా విద్యుదుత్పత్తి సంస్థల ద్వారా బొగ్గు దిగుమతులకు అనుమతించాలి.
రైల్వేలు: చార్జీలను క్రమబద్ధీకరించాలి. వివిధ విభాగాల్లో పీపీపీ విధానాన్ని ప్రోత్సహించాలి.
టెలికం: గతంలో జరిపిన స్పెక్ట్రం కేటాయింపులు, ధర, షేరింగ్ అంశాల్లో అనిశ్చితి తొలగించాలి.
రోడ్లు: ఎక్స్‌ప్రెస్ అథారిటీ ఏర్పాటు చేయాలి. నేషనల్ హైవే అథారిటీ సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ వేగవంతం చేయాలి.

ఇది ఇలా ఉంటే రిటైల్‌లో ఎఫ్‌డీఐలపై పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మరో విడత సంస్కరణలకు సిద్ధమవుతోంది. పింఛను రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం తదితర అంశాలపై ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+