
పారిశ్రామిక సమాఖ్య అసోచాం విడుదల చేసిన నివేదికలో బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు అప్‌ట్రెండ్‌లో ముందుంటాయని అంచనా వేసింది. ఇక వడ్డీ రేట్లకు ప్రభావితమయ్యే రియల్టీ, ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు నెమ్మదిగా పుంజుకుంటాయని తెలిపింది. ఈ సెప్టెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 19,000 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. సెన్సెక్స్ ప్రస్తుతం 18,824 స్థాయిలో ఉంది.
దేశంలోని మౌలికరంగానికి సుమారు బిలియన్ డాలర్లు రూ.55 లక్షల కోట్లు అవసరం... దీనిపై ప్రభుత్వం ఖచ్చితమైన విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తేనే ఖచ్చితమైన ఫలితాలు కనిపిస్తాయని అసోచామ్ తెలిపింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంస్కరణల వల్ల నగదు వినియోగం పెరిగింది. దీనికి తోడు అమెరికన్ సెంట్రల్‌తో పాటు యూరోప్ బ్యాంకులు ఉద్దీపన పథకాలు చేపట్టి నగదు వినియోగం పెంచేందుకు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశీయ మదుపరులతో పాటు విదేశీ మదుపరులు భారత్ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చేసింది. కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వస్తోందని అసోచామ్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ధూత్ చెప్పారు.
గత మూడు సంవత్సరాల నుంచి బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు ప్రదర్శన చాలా పేలవంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. దీని వల్ల రీటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఇన్సిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు
ఇబ్బందులు పడ్డారు. వారితో పాటు భారత పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తప్పలేదని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని చాంబర్ కోరుతుందని ఆయన అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications