ఉద్యోగుల వేతనాలు చెల్లించి విమానాలు నడుపుతాం: కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్

ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో విదేశీ విమానయాన సంస్దలు పెట్టుబడులు పెట్టగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ ఆర్థిక సమస్యలను, తదుపరి రోజుల్లో తీసుకోబోయే చర్యలను డీజీసీఏకు వివరించామని అగర్వాల్ పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో పరిస్దితులు చక్కబడలగవని మేం విశ్వాసంతో ఉన్నాం. కార్యకలాపాల పునరుద్దరణపై అక్టోబరు 4న నిర్ణయం తీసుకుంటామని అగర్వాల్ అన్నారు. కంపెనీలోకి నిధులు రావడానికి మూడు నాలుగు నెలలు పట్టొచ్చని అగర్వాల్ అన్నారు.
గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులను బహిష్కరించిన నేపథ్యంలో ‘ఇంకా నేనూ వేతనాన్ని అందుకోలేదని అన్నారు. రూ.8,000 కోట్ల నష్టాల్లో ఉన్న కింగ్‌ఫిషర్ సంస్థకు మరో రూ.7,000 కోట్లకుపైగా రుణభారం కూడా ఉందని తెలిపారు. కొద్ది నెలల నుంచి పలు విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయని, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు బకాయిలు చెల్లించలేకపోతున్నామన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి వేతనాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా 80 మంది పైలెట్లు, 270 మంది ఇంజనీర్లు అడపాదడపా సమ్మెకు దిగుతుండగా, తాజాగా పైలెట్ల మద్దతుతో శుక్రవారం నుంచి ఇంజనీర్లు ఆందోళనకు దిగారు.
దీంతో విమానానికి సంబంధించి భద్రతాపరమైన క్లియరెన్సునిచ్చేది ఇంజనీర్లే కావడంతో ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి. కేంద్ర పౌరవిమానయాన మంత్రి అజిత్‌సింగ్ సైతం కింగ్‌ఫిషర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రయాణీకుల భద్రత ముఖ్యమని క్లియరెన్స్ ఉన్న విమానాలనే ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. ఇదిలావుంటే గురువారం వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కింగ్‌ఫిషర్ ప్రకటించగా, ఇందుకు కారణం కొంతమంది ఉద్యోగులేనని ఆరోపించింది. తిరిగి శుక్రవారం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని డిజిసిఎకు కింగ్‌ఫిషర్ అధికారులు స్పష్టంచేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications