సోమవారం రాత్రి నుండి పాక్షిక లాకౌట్‌ను ప్రకటించిన కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్

గత ఆరు నెలలుగా జరుగుతున్న వేతనాల జాప్యంతో సమ్మెకు దిగిన ఇంజనీర్లకు మద్దతునిస్తూ సోమవారం పైలెట్లు, మరికొందరు సిబ్బంది విధులను బహిష్కరించారు. ఫలితంగా 50కి పైగా విమానాలు రద్దవగా, ఢిల్లీ, ముంబయి, చెన్నై విమానాశ్రయాల్లోని కింగ్‌ఫిషర్ సిబ్బందితో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరుతోపాటు పుణె, శ్రీనగర్, జమ్ము, ఇంపాల్, డెహ్రాడూన్, ధర్మశాలలకు రాకపోకలు సాగించే విమానాలు నిలిచిపోయాయి. కాగా, ఇంజనీర్ల ఆమోదం లేనిదే విమానాలు నడిపేందుకు అనుమతి లేదని డిజిసిఎ అనుమతి నిరాకరిచింది. సాధారణంగా కంపెనీ ఇంజీనీరు విమానం సురక్షింతగా ఎగరగలదని ధ్రువీకరిస్తేనే విమాన సర్వీసులను నడిపాలని డీజీసీఏ నిబంధనలున్నాయి.
కాగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో డిజిసిఎ కింగ్‌ఫిషర్‌తో మంగళవారం ఢిల్లీలో చర్చలు జరపనుందని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వేతనాల జాప్యంపైనా చర్చలు జరగనున్నాయన్నారు. కాగా, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఇంజనీర్ల అనుమతి వచ్చేవరకు కింగ్‌ఫిషర్ విమానాలను అనుమతించేది లేదని కేంద్ర పౌరవిమానయాన మంత్రి అజిత్‌సింగ్ సైతం స్పష్టంచేశారు.
రూ.8,000 కోట్ల వరకూ రుణ ఊబిలో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ సంస్థ గతంలో నడిపిన 64 విమాన సర్వీసులకు బదులుగా ప్రస్తుతం 14 విమాన సర్వీసులనే నిర్వహిస్తోంది. పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో కింగ్ ఫిషర్ కార్యకలాపాలను సమీక్షిస్తామని డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అరుణ్ మిశ్రా తెలిపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications