
దేశీయ విమానయాన సంస్దల్లో విదేశీ విమాన సంస్దలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విధమైన సమావేశం జరగడం ఇదే తొలిసారి. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అదనంగా సాయం చేయాలంటే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్లు మరికొంత పెట్టుబడిని తీసుకురావాలని బ్యాంకులు గతంలోనే షరతు విధించిన విషయం తెలిసిందే. కానీ, సంస్ద పునరుద్దరణకు సంబంధించి ఆ దిశగా విజయ్ మాల్యా ఎటువంటి ప్రతిపాదన చేయలేదని తెలిసింది.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ తాను తీసుకున్న రూ. 7000 కోట్ల బ్యాంకు రుణానికి ఈ ఏడాది జనవరి నుండి ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. ఇప్పటికే తనఖాలో ఉన్న గోవా విల్లా బదులుగా మరో ప్రాపర్టీని తనఖా పెట్టేం దుకు మాల్యా ప్రతిపాదించగా బ్యాంకర్లు ఏ నిర్ణయ మూ తీసుకోలేదు. వచ్చే నెల మూడో వారంలో బ్యాంకర్లు, కంపెనీ యాజ మాన్యం మరోసారి సమావేశం కానుంది. కంపెనీ బకాయిలు దాదాపు రూ. 7,000 కోట్ల మేరకు పేరుకుపోయిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ వారం వారం చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించడం లేదని పన్ను అధికారి ఒకరు చెప్పారు. తిరగి ఈ పన్ను మొత్తం రూ.60 కోట్లకు చేరందని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్‌కు చెందిన పలు ఖాతాలను పన్ను అధికారులు స్తంభింపచేశారరని ముంబయి సర్వీసు టాక్స్ కమిషనర్ సుశీల్ సోలంకీ చెప్పారు. దీంతో పాటు ఎయిర్ ఇండియా కూడా సుమారు రూ.250 కోట్ల మేర సర్వీసు టాక్స్ చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా కూడా తమకు కొత్తగా పెట్టుబడులు వస్తే మొత్తం ఒకేసారి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఎయిర్ ఇండియాకు చెందిన కొన్ని ఖాతాలను కూడా స్తంభింపచేశామని ఆయన చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications