ఎఫ్‌డీఐలో భాగంగా విదేశీ ఎయిర్‌లైన్స్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు

Kingfisher in talks with foreign airlines for FDI: Mallya
బెంగుళూరు: పెట్టుబడుల కోసం విదేశీ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యా తెలిపారు. యూబీ గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాల్యా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అవును మేం చర్చలు జరుపుతున్నాం అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఐతే, ఏయే కంపెనీలతో చర్చలు జరుపుతున్నదీ వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఏవియేషన్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ ఎఫ్‌డీఐలను అనుమతించడం వల్ల కింగ్‌ఫిషర్‌కి ఎంత మేర ప్రయోజనం చేకూరవచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీటి పరిస్థితి గురించి ఇప్పుడే వ్యాఖ్యానించలేమని పేర్కొన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు ప్రత్యేక ప్రక్రియ ఒకటుందని విజయ్ మాల్యా చెప్పారు. యూబీ గ్రూప్ వార్షిక సర్వ సభ్యసమావేశం సందర్భంగా విజయ్ మాల్యా మాట్లాడుతూ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలపై చర్చించేందుకు ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంతో ఈరోజు కింగ్‌ఫిషర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. దేశీ ఎయిర్‌లైన్స్‌లోకి విదేశీ విమానయాన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించిన తర్వాత తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఉన్న పలు బ్యాంకులకు కింగ్‌ఫిషర్ దాదాపు రూ.7,000 కోట్ల మేరకు బకాయిలు పడిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+