
ఇప్పటి వరకు 8 రాష్ట్రాలు మాత్రమే రిటైల్‌లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తామని ప్రకటించాయని, దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చే వరకు ఆగే ప్రసక్తి లేదని త్వరలోనే మహారాష్ట్ర తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రీటెయిల్ స్టోర్‌లను ప్రారంభిస్తామని అన్నారు. రిటైల్‌లో మూడేళ్లలో 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సాధ్యమేనన్నారు. భారతి రీటెయిల్ ఈజీడే బ్రాండ్ పేరుతో దేశంలో సుమారు 205 స్టోర్‌లను నిర్వహిస్తోంది. తమకు దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి ఆరు లక్షల వరకు కస్టమర్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరులో బెస్ట్ ప్రైస్ స్టోర్లున్నాయి. ఇందులో 200 మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నామన్నారు.
ఈ ఏడాది భారత్‌లో మరో 5-6 బెస్ట్ ప్రైస్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని, అందులో కనీసం 2 స్టోర్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేటట్లు చూస్తామన్నారు. ప్రతి సంవత్సరం 10 బెస్ట్ ప్రైస్ స్టోర్లను ప్రారంభించాలనేది తమ ఆలోచన. ఒక్కో స్టోర్‌పై సగటున రూ.35-40 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ప్రస్తుతం 6,500 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నామని, మూడేళ్లలో ఈ సంఖ్యను 35,000కు పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు రాజ్ జైన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవలే భారత ప్రభుత్వం మల్టీ బ్రాండ్ రీటెయిల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 51 శాతం అనుమ తిస్తూ కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రాలు కావాలనుకుంటే వాటిని అనుమతించవచ్చు లేదా వ్యతిరేకించుకునే అవకాశం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే.
ఐతే ఈ స్టోర్‌లు కనీసం పది లక్షల జానాభా ఉన్న పట్టణాల్లో ప్రారంభించేందుకు అనుమతించింది. అయితే విదేశీ కంపెనీలు ఎఫ్‌డీఐ కింద దేశంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. వీటిలో 50 శాతం మౌలిక సదుపాయాలకే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉదా. శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, సరఫరా చెయిన్లపెై పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం షరతు విధించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications