2000 మంది ఉద్యోగులకు ఉపాధినిచ్చే వైజాగ్ విప్రో డెలివరీ సెంటర్

Wipro Expands opens 2000-seat delivery centre in Vishakhapatnam
విశాఖపట్టణం: గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్ మరియు అవుట్సోర్సింగ్ కంపెనీ అయిన విప్రో టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 2,000 సీటింగ్స్‌తో డెలివరీ సెంటర్‌ను తెరిచింది. ప్రస్తుతం ఈ డెలివరీ సెంటర్‌లో 100 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. రాబోయే మూడు నెలల్లో మరో 300 మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది. ఈ డెలివరీ సెంటర్‌ను కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి (ఉన్నత విద్య) శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్బంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ విప్రో టెక్నాలజీస్ ఈ ప్రాంతంలో ఉన్న వివిధ యూనివర్సిటీలతో అనుసంధానమై లోకల్ టాలెంట్‌ను ప్రోత్సాహాపరచే భాగంలో ఇక్కడ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిందని అన్నారు.

హారి హెగ్డే (వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెడ్ ఆపరేషన్స్, విప్రో) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత 20 సంవత్సరాలుగా మా సేవలను అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పట్టణమైన విశాఖపట్టణంలో విప్రో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉంది. మా యొక్క బిజినెస్ ఆపరేషన్స్‌కు గాను ఈ వాతావరణం, లోకల్ టాలెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇక్కడున్న లోకల్ టాలెంట్‌, స్కిల్స్‌ను ఉపోయోగించుకోని విప్రో ఆంధ్రప్రదేశ్‌లో మరితంగా ముందుకు సాగుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో విప్రో సేవలను కొనసాగిస్తుందని.. ఆంధ్రప్రదేశ్ మొత్తం గనుక చూసుకున్నట్లైతే విప్రో ఉద్యోగులు సంఖ్య 10,000కు పైగా చేరిందని అన్నారు. 2008-09 మరియు 2009-10 సంవత్సరాల్లో విప్రో టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ సెజ్‌లలో బెస్ట్ ఎక్స్‌ఫోర్ట్ ఫెర్పామెన్స్ అవార్డులను సొంతం చేసుకుందని గుర్తు చేశారు. IT మరియు ఆంధ్ర ప్రదేశ్ ITES ఇండస్ట్రీ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2009 నుండి 2011వ సంవత్సరం వరకు విప్రో టెక్నాలజీస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతి పెద్ద ఐటీ ఎక్స్‌ఫోర్టర్‌గా రికార్డుకెక్కింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+