
‘క్యాష్ రిట్రాక్షన్' అంటే ఏమిటీ..?
ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బుని విత్‌డ్రా చేసిన తర్వాత కరెన్సీ నోట్లను త్వరగా తీసుకోకపోతే ఆ డబ్బుని ఏటీఎమ్ మెషిన్ వెనక్కి తీసుకుంటుంది.. దీనిని క్యాష్ రిట్రాక్షన్ అని అంటారు.
‘క్యాష్ రిట్రాక్షన్' పద్ధతిని నిలుపుచేయడానికి కారణం:
క్యాష్ రిట్రాక్షన్ ఫెసిలిటీ ఉన్న ఏటీఎమ్‌ల వద్ద డబ్బును డ్రా చేసినప్పుడు బయటకు వచ్చే నోట్లలో ఒకటి రెండు నోట్లను మాత్రం యంత్రం వెనుకకు లాగేసుకొనేటట్లు చూసుకొంటూ ఎక్కువ నోట్లను తాము తీసుకోని ఆ తర్వాత డబ్బు అందలేదని క్లెయిమ్ చేయడం ఇందులో పరిపాటిగా జరుగుతున్న మోసం. దీంతో రిట్రాక్షన్ అయిన లాదాదేవీల్లో డబ్బు ఖాతాదారు అకౌంట్‌లో జమ అయిపోతుంది. దీంతో బ్యాంకులు నష్టపోవడం జరుగుతూ వచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి పలుమోసాలు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో వీటికి చెక్ పెట్టే నిమిత్తం క్యాష్ రిట్రాక్షన్ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. నిజానికి ఏటీఎంలో కస్టమర్ నగదును తీసుకోవడం మరచిపోయి వెళ్లిపోయినా, అతని అకౌంట్‌లో సొమ్ము తిరిగి జమ కావడం కోసం క్యాష్ రిట్రాక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యాన్ని కొంతమంది తప్పుదోవ పట్టించడంతో ఆర్‌బీఐ తాజా ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చింది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితరాలు తమ ఏటీఎంల నుంచి క్యాష్ రిట్రాక్షన్ సౌకర్యాన్ని ఉపసంహరించాయి. త్వరలోనే అన్ని బ్యాంకులూ క్యాష్ రిట్రాక్షన్‌ను నిలుపుచేయనున్నాయి. ఈ విషయాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తున్నాయి. దీంతో ఇక బ్యాంకు కస్టమర్లు ఏటీఎంలలో నగదును తీసుకోలేక పోయామంటూ ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉండదు. ఫలితంగా ఏటీఎంలలో పిన్ టైప్ చేయడం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాక డబ్బును స్వీకరించడంలో జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications