ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా 'గూగుల్'

ఈ సర్వేలో సుమారు 12 అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన 144,000 మంది విద్యార్థులను ఉద్యోగాల్లో చేరి తమ కేరీర్‌ను మరింత అభివృద్ధిలోకి రావాలనుకునే వారిని సర్వే చేసింది. వాటిలో రెండు కేటగిరీలుగా విభజించింది. ఒకటి వ్యాపారం, రెండోది ఇంజినీరింగ్. బిజినెస్ కేటగరిలోకి వస్తే గూగుల్ టాప్ ర్యాంక్‌లోకి రాగా.. తర్వాత స్థానం కెపీఎంజీ రెండవ స్థానం దక్కించుకుంది. మూడవ స్థానం ప్రాక్టర్ అండ్ గేంబిల్‌లు దక్కించు కున్నాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయిలో అత్యంత ఉత్తమ యాజమన్యాల కంపెనీల విష యానికి వస్తే నాలుగవ స్థానం మైక్రో సాఫ్ట్, డెలాయిల్ (5), ఎర్నెస్ట్ అండ్ యంగ్ (6) పీడబ్ల్యుసీ (7), జేపీ మోర్గాన్ (8), కోకాకోలా (9), గోల్‌మన్ సాచేస్ (10)లు ఉన్నాయి.
ఇక ఇంజి నీరింగ్ కేటగిరిలోకి వస్తే గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. (వరసగా నాలుగు సంవత్సరాల నుంచి నెంబర్ వన్ స్థానం) తర్వాత రెండవ స్థానం ఐబీఎం, మూడవ స్థానం మైకోసాఫ్ట్ నాలుగవస్థానం బీఎండబ్ల్యు, ఇంటెల్ (5); జనరల్ ఎలక్ట్రికల్ (6), సీమన్స్ (7), ఆపిల్ (8), సోనీ (9), ప్రాక్టర్ అండ్ గేంబిల్ (10). కాగా సాఫ్ట్‌వర్ దిగ్గజాల్లాంటి కంపెనీల్లో ఇంజినీరింగ్‌కానీ, ఐటీ రంగంలో కానీ ప్రవేశించి తమ కేరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులు కాలేజీ స్థాయిలోనే కలలుకంటుంటారు. ఈ కంపెనీలు శిక్షణతోపాటు నెట్‌వర్కింగ్, ఫ్యూచర్ కేరీర్ లాంటి అందుబాటులో ఉంచుతాయని నైలాండర్ తెలిపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications