తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన మీడియా గ్రూప్ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్‌ఎల్)కు సంబంధించి రుణాల పునర్ వ్వవస్దీకరణ (సీడీఆర్)కు వెళ్లాలన్న సంస్ద ఆలోచనలకు కొన్ని బ్యాంకులు, ఆర్దిక సంస్దలు కుదరదన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో జరుగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు అసలు డెక్కన్ క్రానికల్ ఆస్తులు, అప్పుల చిట్టా వివరాలు అందుబాటులో లేకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయంలో డీసీహెచ్‌ఎల్ గ్రూప్ ప్రాతిపదికన సీడీఆర్‌కు వెళ్లాలాలేదంటే అనుబంధ సంస్థల ప్రాతిపదికన నడుచుకోవాలా అనే సందిగ్దంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఆలోచిస్తున్నాయి.
డీసీహెచ్‌ఎల్ ప్రతిపాదిస్తున్న సీడీఆర్‌పై అంతగా ఆసక్తి కనబరచడం లేదని సమాచారం. ఇంకొన్ని సంస్థలైతే.. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నాయి. కాగా, ఈ నెల 7న సమావేశమైన డీసీహెచ్‌ఎల్ బోర్డు.. సీడీఆర్‌కు దరఖాస్తు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంపెనీకి సుమారు రూ.5,000 కోట్ల మేరకు అప్పులున్నట్లు అధికారిక వర్గాలే చెబుతున్నాయి. డీసీహెచ్‌ఎల్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 75 శాతం అంగీకరిస్తేనే సీడీఆర్‌కు అవకాశం ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగమైన డెక్కన్ ఛార్జర్స్‌కు డబ్బు చెల్లించేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అనుకున్న సమయంలో ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేకపోయిన డెక్కన్ చార్జర్స్‌కు 2013 ఐపీఎల్ మ్యాచుల్లో ఆడేందుకు అవసరమైన నిధులను బ్యాంకులు అందించనున్నాయి. యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, రత్నాకర్ బ్యాంక్, శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, రెలిగేర్ ఫిన్‌వెస్ట్‌లతో కూడిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల కన్సార్షియం ఇందుకు సంసిద్ధమైనట్లు ఓ ప్రముఖ పత్రికలో కథనం వెలువడింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
డెక్కన్ విషయంలో రుణాల పునర్ వ్వవస్దీకరణ (సీడీఆర్) కుదరదంటున్న బ్యాంకులు | Axis Bank, ICICI Bank not keen to refer Deccan Chronicle for debt rejig | రుణ సంక్షోభం నుండి డెక్కన్ క్రానికల్ గట్టేక్కేనా..?
Some of the lenders of debt ridden Deccan Chronicle Holdings (DCHL) are not keen on a debt recast of the company owing to lack of clarity over the approach and pending submission of a forensic audit report. The decision of the select group of lenders comes even as there is a board resolution passed by DCHL for going to the Corporate Debt Restructuring cell to recast its Rs. 5,000 crore debt.
Story first published: Thursday, September 20, 2012, 11:03 [IST]
Other articles published on
Sep 20, 2012