కూరగాయల ధరలు పెరుగుదలతో రెండంకెలస్దాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం

Vegetable prices push up retail inflation to 10.03 per cent
కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆగస్టు నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రెండంకెలస్థాయి 10.03 శాతానికి చేరింది.గత జూలైలో 9.86% ఉన్న వినియోగ ధరల సూచి (సిపిఐ) ఆధార రిటైల్ ద్రవ్యోల్బణం గతనెల 10.03 శాతానికి దూసుకెళ్లింది. మంగళవారం విడుదల చేసిన సిపిఐ గణాంకాలను అనుసరించి గతనెల కూరగాయల ధరలు రికార్డుస్థాయి లో 20.79% పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో సీపీఐ ఆగస్టు నెలలో 10.19 శాతంగా నమోదు కాగా అంతక ముందు నెల జులెైలో 10.10 శాతంగా నమోదెైంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆగస్టు నెలలో 9.90 శాతంగా నమోదు కాగా... అంతకు ముందు జులెై నెలలో 9.76 శాతంగా నమోదెైంది.

ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణంలో ఈనెల 13న ప్రభుత్వం డీజిల్ ధర పెంచిన ప్రభావం లేదు. ప్రభుత్వం చమురు మార్కెటింగ్‌ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు డీజిల్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఆగస్టులో ఆహారం, బేవరేజెస్ విభాగంలో సిపిఐ 12.03%, ఫుట్‌వేర్, బట్టల విభాగం సిపిఐ 10.71%, ఇంధన, లైట్ విభాగంలో 7.55% వంతున పెరిగింది. వ్యక్తిగత విభాగాల్లో ఆయిల్, ప్యాట్స్ విభాగంలో సిపిఐ అత్యధికంగా 18.41% నమోదైంది. చక్కెర (17.51%), అపరాలు (16.04%) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి.

కాగా, రిజర్వ్ బ్యాంక్ సోమవారం ద్రవ్యవిధాన సమీక్షను వెల్లడించిన సందర్భంగా ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వడ్డీరేట్లు తగ్గించకపోవడానికి ద్రవ్యోల్బణం ఒత్తిళ్లే కారణమని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడి తీవ్రంగా వుంది. అందువల్ల ధరల కట్టడికే తాము ప్రధానంగా దృష్టిసారించామని తెలిపింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తేనే కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తామని ప్రకటించింది. వృద్ధిరేటు కుంటుపడి పోతోందని వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా ఆర్‌బీఐ చలించకుండా కేవలం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) కేవలం 0.25 శాతం తగ్గంచిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+