భారతదేశంలో అత్యంత అధిక సంపద కలిగిన వారి సంఖ్య 7730కు చేరినట్లు ఒక నివేదిక తెలిపింది. వీరి ఆస్తుల విలువను 925 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. దేశం మొత్తం మీద వీరిలో 109 మందిని బిలియనీర్లుగా పేర్కోంది. అంతర్జాతీయ ఇంటెలిజెన్సీ సంస్ద 'వెల్త్ ఎక్స్' 2012-13 సంవత్సరానికి గాను రూపొందించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. గత సంవత్సరంలో ఇదే సమీక్ష కాలానికి భారత్‌లో అధక సంపద కలిగిన వారి సంఖ్య 8215గా నమోదుకాగా, వీరి ఆస్తుల విలువ 980 బిలియన్ డాలర్లగా ఉండేదని నివేదికలో పేర్కొంది.
నివేదికలో ఉన్న మరికొన్ని ముఖ్యాంశాలు:
* 109 మంది బిలియనీర్లలో సగటున చూస్తే ఒక్కొక్కరి వద్ద ఉన్న సిరుల విలువ దాదాపు 1.7 బిలియన్ డాలర్లు(రూ. 9350 కోట్లు). ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించినప్పుడు, అత్యంత అధిక నికర విలువ కలిగిన వారు 0.6 శాతానికి పెరిగి 1,87,380 మంది అయ్యారు. వీరి ఉమ్మడి సంపద విలువ 25.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
* భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో అందరికన్నా కింద ఉన్న వర్గం వారి వద్ద 30 మిలియన్ డాలర్లు (రూ. 165 కోట్లు) నుండి 49 మిలియన్ డాలర్లు (రూ. 269 కోట్లు) మధ్య సంపద కేంద్రీకృతమై ఉంది. ఈ వర్గం వారు భారత్‌లోని మొత్తం అత్యంత అధిక నికర విలువ కలిగిన వారిలో 45.7 శాతంగా ఉన్నారు.
* అత్యంత అధిక సంపద కలిగి ఉండే వారి సంఖ్య, వారి సంపద వృద్ది చాలా వరకు ఆర్దిక వ్యవస్ద పని తీరుపైనా, ప్రభుత్వ విధానాల్లో స్పష్టత పైనా ఆధారపడి ఉంటుంది. అత్యంత సంపన్నుల జాబితా 8 శాతం మేరకు తగ్గిపోవడంతో భారత్ లో జీడీపీ తగ్గిపోవడం, స్టాక్ మార్కెట్ల పేలవ ప్రదర్శనకు దారితీసింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
దేశంలో అత్యంత అధిక సంపద కలిగిన వారి సంఖ్య 7730 | India's 7,730 super rich collectively own $925 bn: report | దేశంలో బాగా డబ్బునోళ్ల సంఖ్య 7,730
India is home to as many as 7,730 ultra high net worth (UHNW) individuals whose combined wealth amounts to a whopping $925 billion, says a study. According to the world ultra wealth report 2012-13, by Wealth X, a global wealth intelligence and prospecting company, India has 7,730 UHNW individuals, of which 109 are billionaires.
Story first published: Tuesday, September 18, 2012, 10:47 [IST]
Other articles published on
Sep 18, 2012