డీజిల్ ధరలు పెంచడంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి. మెటల్, బ్యాంకు సూచీలు ఏకంగా 3 శాతం లాభపడుతున్నాయి. ఆటో, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2 శాతానికి పైగా పెరుగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ ఎలో ఎస్సార్ ఆయిల్, యెస్ బ్యాంక్, హిందాల్కో, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా మోటార్స్ షేర్లు 5 శాతం దాకా లాభపడుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరో వైపు గ్లెన్ మార్క్ ఫార్మా, లుపిన్ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోతూ టాప్ లూజర్స్‌గా ఉన్నాయ.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే ఈరోజు(శుక్రవారం) భారీగా లాభపడుతున్నాయి. 40 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ ప్రకటించారు. మార్కెట్ వర్గాలు అంచనా వేసిన దానికంటే బెర్నాంకీ ఎక్కువ ప్యాకేజిని ప్రకటించడంతో.... 2007 డిసెంబర్ 11 తర్వాత మళ్లీ ఆ స్దాయికి డౌజోన్స్ వచ్చింది. డౌజోన్స్ సూచీ 1.53 శాతం లాభపడి 13, 539 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నాస్‌డాక్ 1.32 శాతం పెరిగి 3,155 పాయింట్ల వద్ద ముగిసింది. స్టిమ్యులస్ ప్యాకేజీ రావడానికి ముందే యూరోప్ మార్కెట్లు ముగిశాయి. ఈ కారణంగా జర్మనీ సూచీ 0.45 శాతం, ప్రాన్స్ సూచీ 1.19 శాతం నష్టపోయాయి. బ్రిటన్ సూచీ 0.65 శాతం లాభపడింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications