
డెక్కన్ ఛార్జర్స్ వేలంలో పాల్గోనదలచుకున్న సంస్దలు రూ. 5 లక్షలు చెల్లించి ముంబై వాంఖెడ్ స్టేడియంలోని బిసిసిఐ నుండి దరఖాస్తు కొనుగోలు చేయాలి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను చెన్నైలో దాఖలు చేయాలి. ఆ తర్వాత వెంటనే దరఖాస్తులను పరిశీలించి విజేతను ప్రకటిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు బిడ్డింగ్ దాఖలు చేసేందుకు వ్యవధి ఉండటంతో చివరి రోజు మరిన్ని సంస్థలు తెరపైకి రావొచ్చని భావిస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రానికి కల్లా బిడ్డింగ్‌లో గెలిచిందెవరో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఒకవేళ అనుకొన్న ధర రాకపోతే వేలాన్ని రద్దు చేసే అధికారం డీసీహెచ్‌ఎల్‌కు ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చార్జర్స్‌కు రూ.1,000-1,200 కోట్ల వరకు ధర లభిస్తుందని డీసీహెచ్‌ఎల్ యాజమాన్యం భావిస్తోంది. ఇంతకంటే తక్కువ ధర పలికితే వేలాన్ని రద్దు చేయొచ్చు. వేలంలో అనుకున్న ధర వచ్చినట్లైతే బీసీసీఐకి 5 శాతం మొత్తాన్ని చెల్లించి 95% డీసీహెచ్‌ఎల్ తీసుకుంటుంది. ఒకవేళ చార్జర్స్‌కు రూ.1,000 కోట్లు వస్తే.. అందులో రూ.950 కోట్లు డీసీహెచ్‌ఎల్ యాజమాన్యానికి లభిస్తుంది. ప్రస్తుతం డీసీహెచ్‌ఎల్ రుణ భారం రూ.5,000 కోట్లు ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డెక్కన్ చార్జర్స్‌ను రూ.428 కోట్లకు డీసీహెచ్‌ఎల్ కొనుగోలు చేసింది.
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు రూ. 5000 కోట్ల మేరకు రుణ భారం ఉన్నట్లు కేంద్ర ఆర్దిక సేవల కార్యదర్శి డికె మిట్టల్ వెల్లడించడంతో ఈ సంస్దకు అప్పులిచ్చిన బ్యాంకులు ఆశ్యర్యపోతున్నాయి. ఇంతకాలం ఈ సంస్దకు బ్యాంకులిచ్చిన అప్పు కేవలం రూ. 3,000 నుండి 3,500 వరకు ఉంటుందని అంచనా. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకు అప్పు ఇచ్చిన నేపధ్యంలో ఏ బ్యాంక్ నుండి ఎంతెంత తీసుకున్నారు, మొత్తం అప్పు ఎంత ఉందనే సమాచారం బ్యాంకుల వద్ద లేదు. ఐతే డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన అప్పులో పైవేటు రంగ బ్యాంకుల వాటా అధికంగా ఉందని, ప్రభుత్వ బ్యాంకుల వాటా తక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది.
ఏది ఏమైనప్పటికీ.. ఈరోజు సాయంత్రానికి డెక్కన్ ఛార్జర్స్ వేలం ముగిసి, కొత్త యాజమాన్య ఏదో తెలియనుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications