డెక్కన్ ఛార్జర్స్ కొనుగోలుదారుల్లో ఎవరెవరు ఉన్నారు..?

ఇటీవలే వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ బహిరంగంగానే డెక్కన్ ఛార్జర్స్ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్‌ఎల్)లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమేనని రాష్ట్రానికి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ పీపల్ క్యాపిటల్ ఎండీ శ్రీనిరాజు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ కొనుగోలుకు తాము బిడ్డింగ్ వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
డెక్కన్ ఛార్జర్స్ వేలంలో పాల్గోనదలచుకున్న సంస్దలు రూ. 5 లక్షలు చెల్లించి ముంబై వాంఖెడ్ స్టేడియంలోని బిసిసిఐ నుండి దరఖాస్తు కొనుగోలు చేయాలి. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను చెన్నైలో దాఖలు చేయాలి. ఆ తర్వాత వెంటనే దరఖాస్తులను పరిశీలించి విజేతను ప్రకటిస్తారు. ఈ వేలం పాటలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్‌కు తగినంత ధర రాని పక్షంలో తిరస్కరించే బిడ్డింగ్ ప్రక్రియను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఐపీఎల్ ప్రాంఛైజీ వేలం ద్వారా వచ్చిన సొమ్ములో 5 శాతాన్ని బిసిసిఐ తీసుకుంటుంది. మిగిలిన డబ్బుని డెక్కన్ ఛార్జర్స్ సంస్దకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
సుమారు రూ.5,000 కోట్ల మేరకు అప్పులున్న డెక్కన్ క్రానికల్‌లో ఆయన స్వయంగా పెట్టుబడి పెట్టడం లేదా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో కలిసి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన సుమారు రూ.500-1,000 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డీసీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పీపల్ క్యాపిటల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీనిరాజు.. గతంలో సత్యం కంప్యూటర్స్ సీవోవోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవోగా కూడా పనిచేశారు.
డెక్కన్ ఛార్జర్స్ కోసం రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన పీవీపీ వెంచర్స్ కూడా పోటీలో ఉంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications