రూ. 1,932 కోట్లతో స్విస్ కంపెనీని కొనుగోలు చేసిన ఇన్పోసిస్

ఈ ఒప్పందం అక్టోబర్ నెల చివరకు ఒక కొలిక్కి రానుంది. లోడ్‌స్టోన్ ఛైర్మన్, సీఈఓ రొనాల్డ్ హాఫ్నర్న్‌ను ఇక ముందూ అదే పదవిలో కొనసాగించాలని ఇన్పోసిస్ నిర్ణయించింది. లోడ్‌స్టోన్ కొనుగోలుతో అనుభవజ్ఞులైన 750 మంది కన్సల్టెంట్లు, 200 మంది క్లయింట్లను పొందనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ సొంతంగా 700 మంది క్లయింట్లకు సేవలందిస్తోంది. అంతేకాకుండా తయారీ, ఆటోమోటివ్, లైఫ్‌సెన్సైస్ రంగాలలో మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు వీలుకలగనుందని వివరించింది. తమ కన్సల్టింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ బిజినెస్‌లో 30,000 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారని, 10 రకాల పారిశ్రామిక విభాగాలలో సేవలందిస్తున్నామని కంపెనీ తెలిపింది.
ఇన్పోసిస్ సీఈఓ, ఎండీ ఎస్‌డి శిబులాల్ మాట్లాడుతూ తమ కంపెనీ అమలు చేయనున్న 3.0 వ్యూహంలో కన్సల్టింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ వ్యాపారాలను విస్తరించుకోవడం ఒక భాగమని, లోడ్‌స్టోన్ కొనుగోలు ఆ వూహ్యానికి అనుగుణంగానే ఉందన్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్పోసిస్ షేరు ధర సోమవారం ఒక శాతానికి పైగా పెరిగి రూ. 2,527 స్దాయికి చేరింది. చివరకు ముగింపు ధర అయిన రూ. 2,496తో పోలిస్తే 0.66 శాతం అధికంగా రూ. 2.512.35 వద్ద స్దిరపడింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications