స్టాక్ మార్కెట్లో సోమవారం నాటి భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 17,766 వద్ద ముగియగా.. నిప్టీ 5 పాయింట్ల లాభంతో 5,363 వద్ద ముగిసింది. ఇక ఈ ట్రేడింగ్‌లో రియాలిటీ, బ్యాంకు, విద్యుత్ సెక్టార్ల షేర్లు డౌన్‌ట్రెండ్‌లో ముగిశాయి.
సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా స్టీల్, బజాజ్ ఆటో కంపెనీలు షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. యాక్సీస్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భెల్, ఎస్ బీఐ, టాటా పవర్ కార్పొరేషన్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసాయి.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే అపరిమతంగా బాండ్లను కొనుగోలు చేస్తామని ఈసీబీ చెప్పడంతో యూరోప్ మార్కెట్లు రెండో రోజు కూడా లాభాల బాటలో ఉన్నాయి. జర్మనీ సూచీ 0.65 శాతం, బ్రిటన్ సూచీ 0.3 శాతం, ఫ్రాన్స్ 0.26 శాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌజోన్స్ 0.1 శాతం పెరిగింది. నాస్‌డాక్ లాభనష్టాలు లేకుండా ముగిసింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
స్టాక్ మార్కెట్: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీ | Markets End flat; Tata Steel, Sun Pharma rally | స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీ
Markets ended the day flat, after trading in a tight range for most of the day, ahead of a data packed week globally and domestically. The S&P CNX Nifty ended up 4 points, while the Sensex gained 17 points.
Story first published: Tuesday, September 11, 2012, 16:42 [IST]