తక్కువ వేతనాలు అందుకున్న భారత ఐటీ ఉద్యోగులు

అత్యధిక ఐటీ వేతనాలు లభిస్తున్న టాప్-10 దేశాల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యల్ప వేతనాలున్న 10 దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో ర్యాంకులో ఉంది. 4 సంవత్సరాలు, అంత కన్నా ఎక్కువ అనుభవం కలిగిన ఉద్యోగుల సగటు వేతనాలను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 40 దేశాలు 6 వేలకు పైగా కంపెనీల్లోని ఐటీ సిబ్బంది వార్షిక నగదు వేతనాలు, మొత్తం వేతన ప్యాకేజీల ఆధారంగా జాబితాను రూపొందించారు. పశ్చిమ యూరప్ దేశాల కంపెనీలు వేతన చెల్లింపుల్లో టాప్‌లో నిలుస్తున్నాయి. చైనా తదితర పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో ఐటీ మేనేజర్లకు మెరుగైన వేతనాలే లభిస్తున్నాయి.
తక్కువ ఐటీ వేతనాలు అందించే కంపెనీల జాబితా:
తక్కువ ఐటీ వేతనాలున్న ర్యాంకుల జాబితాలో బల్గేరియా(సగటు వార్షిక వేతనం 23,745 డాలర్లు) టాప్‌లో ఉండగా... తర్వాత స్థానాల్లో వియత్నాం(29,831 డాలర్లు), ఇండోనేసియా(33,768 డాలర్లు), ఫిలిప్పీన్స్(33,965 డాలర్లు), థాయ్‌లాండ్(34,107 డాలర్లు), మలేసియా(36,790 డాలర్లు), చైనా (38,624 డాలర్లు) ఉన్నాయి.
ఎక్కువ ఐటీ వేతనాలు అందించే కంపెనీల జాబితా:
టాప్ ఐటీ వేతనాల లిస్ట్‌లో స్విట్జర్లాండ్ తర్వాత బెల్జియం(1,44,980 డాలర్లు), డెన్మార్క్(1,36,542 డాలర్లు), అమెరికా(1,28,632 డాలర్లు), బ్రిటన్(1,27,890 డాలర్లు) నిలిచాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications