
కొత్త యాజమాన్యం చేతికి వచ్చాక కూడా చార్జర్స్ జట్టు హైదరాబాద్ కేంద్రంగా, అదే టీమ్ పేరుతో పని చేస్తుంది. అయితే ఈ విషయంలో కొత్త యాజమాన్యం, బీసీసీఐతో మళ్లీ తాజా ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. జట్టును కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ, చార్జర్స్ అప్పులు తీర్చేందుకు ఆ సొమ్మును నేరుగా బ్యాంకులకే చెల్లించాల్సి ఉంటుంది. ఆటగాళ్ల బాకీలకు కూడా కొత్త ఫ్రాంచైజీ చెల్లించాలి. టీమ్‌ను కొనుగోలు చేసిన మొత్తంలో ఐదు శాతం బీసీసీఐ ఖాతాలోకి వెళుతుంది. శుక్రవారం నుంచి బుధవారం వరకు టెండర్లు స్వీకరించి గురువారం వాటిని తెరుస్తారు.
నాలుగేళ్ల క్రితం డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని పది సంవత్సరాలకు గాను డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) యాజమాన్యం సుమారు రూ. 300కోట్లు బిసిసిఐకి చెల్లించి సొంతం చేసుకుంది. ఈ పది సంవత్సరాలకు గాను ఫీజు క్రింద రూ. 428 కోట్లు చెల్లించేందకు సిద్దపడింది. ఇందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే చెల్లించింది. ఇంకా 5ఏళ్లు కాలం ఈ ఫ్రాంచైజీని నిర్వహించే అవకాశం డెక్కన్ యాజమాన్యానికి ఉంది. ఈ ఫ్రాంచైజి పేరు మీద ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 480 కోట్లు, యస్ బ్యాంకు మరియు మరో ప్రైవేటు బ్యాంకు నుండి ఇంకొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రాంఛైజీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని ఈ బ్యాంకుల అప్పులు తీర్చడానికి ఉపయోగించనున్నారు.
ఐదు ఐపీఎల్‌లలో డెక్కన్ చార్జర్స్ టీమ్ ప్రదర్శన, ప్రస్తుత జట్టు బలాబలాలను బట్టి చూస్తే దక్కన్ ఛార్జర్స్‌ను కొనుగోలు చేయడానికి చెన్నై, అహ్మదాబాద్‌లకు చెందిన రెండు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతన్నట్లు తెలుస్తోంది. కాగా ఛార్జర్స్ ప్రారంభ ధరను సుమారు రూ 500-700 కోట్ల మధ్య ఉండే ఖరారు చేసే అవకాశాలు కనబడు తున్నాయి. నష్టాల్లో కూరుకునిపోయిన ఛార్జర్స్ గత ఐపిఎల్‌కు సంబంధించి బకాయి లను ఇంకా ఆటగాళ్లకు చెల్లించలేదు. అందువల్ల ఆటగాళ్ల బకాయిలను ముందుగా ఛార్జర్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు చెల్లించేలా బోర్డు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లించడానికి ఎవరు అంత సునాయాసంగా ముందుకు వచ్చే అవకాశం లేనందున, కొంత వెసులుబాటు కూడా కలిగించాలనే అభిప్రాయంతో బోర్డు ఉన్నట్లు ఆ వర్గాలు వివరిం చాయి. ఛార్జర్స్‌ను కొనుగోలు చేసేవారు సొమ్ములో కొంత సొమ్మును వెంటనే చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే..వారిచ్చే బ్యాంక్ గ్యారంటీ ద్వారా బకాయిలు చెల్లించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఉంది. ఈ క్రమంలో బోర్డు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఇప్పటికే బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిపారని సమాచారం.
2008లో జరిగిన ఐపిఎల్ వేలంపాటలో దాదాపు 107 మిలియన్ డాలర్లను వెచ్చించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చార్జర్స్ జట్టును సొంతం చేసుకుంది. 2009లో జరిగిన ఐపిఎల్ రెండో ఎడిషన్‌లో డెక్కన్ ఛార్జర్స్ చాంపియన్‌గా నిలిచింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications