
ఈనెల 17న జరగనున్న పరపతి విధాన సమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని రిజర్వ్ బ్యాంక్ ఒక శాతం తగ్గించొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ ప్రతీప్ చౌదరి తెలిపారు. గత కొంతకాలంగా సీఆర్‌ఆర్‌ను రద్దు చేయాలని లేదా ఆ నిధులపై వడ్డీ చెల్లించాలని ప్రతీప్ చౌదరి అన్నారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా సీఆర్ఆర్ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ప్రతీప్ చౌదరి, డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
మంగళవారం జరిగిన ఫిక్కీ-ఐబీఏ సదస్సులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తొలిసారి పెదవి విప్పారు. సదస్సులో మాట్లాడుతూ నేనొక ముఖ్యమైన ప్రకటన చేయాలి. గత రాత్రే దీనిపై ఒక కమిటీని నియమించాను. అసలు సీఆర్‌ఆర్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందులో.. కేసీ చక్రవర్తి, ప్రతీప్ చౌదరి సభ్యులుగా ఉంటారు.
కమిటీ నిబంధనలేమిటంటే.. ఈ ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేదాకా వారిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. నా పదవీ కాలం పూర్తయ్యేదాకా వారు నివేదిక ఇవ్వరాదన్నది ముఖ్యమైన షరతు అంటూ సుబ్బారావు సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, నిజమేచెబుతున్నారా లేదా జోక్ చేస్తున్నారా అంటూ అక్కడున్న బ్యాంకర్లు అడగ్గా ‘మీరేమనుకుంటున్నారు?' అని ఆయన ఎదురుప్రశ్న వేశారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications