న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ' ప్రస్తుతం ఇంగ్లీషులో ఉన్న మదుపుదారుల వెబ్‌సైట్‌ను 13 భారతీయ భాషల ఇన్వెస్టర్లకు తన వెబ్‌సైట్ సేవలను విస్తరించాలని భావిస్తుంది. మదుపుదారుల్లో చైతన్యాన్ని మెరుగుపరచడం, వారి సమస్యల పరిష్కారానికి సహాయపడడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తుంది.
ఈ 13 భాషల్లో తెలుగుతో సహా హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళం, ఉర్దూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణ దిశగా సెబీ వేగంగా అడుగులు వేస్తోంది. ఐతే ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీలు, బ్యాంకర్లు ఎలా నిర్ణయించారన్న వివరాలను ముదుపర్లకు తెలపాలని త్వరలో సెబీ కోరనుంది.
ఇందులో భాగంగా పలు అంశాలకు సంబంధించి మార్గదర్శకాలు, సహాయ సహకారాలు ఇన్వెస్టర్లు పొందేందుకు వీలుగా సెబీ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (1800 22 7575/1800 266 7575) సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకే కాకుండా శని, ఆదివారాలూ అందుబాటులో ఉండేలా ఇటీవలే చర్యలు తీసుకుంది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
13 భారతీయ భాషల్లోకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెబ్‌సైట్ | Market regulator Sebi plans investor website in 13 Indian languages | 13 భారతీయ భాషల్లోకి సెబీ వెబ్‌సైట్
Market regulator Sebi is planning to soon offer its investor website in as many as 13 Indian languages, besides the existing one in English, to spread awareness among investors and to help resolve their grievances.
Story first published: Monday, September 3, 2012, 11:38 [IST]
Other articles published on
Sep 3, 2012