FY'12 ఏడాదికి బీఎస్‌ఎన్‌ఎల్ నష్టం రూ. 8,850 కోట్లు

ఇంటర్ మినిస్ట్రల్ బాడీ టెలికామ్ కమీషన్ ఈరోజు సోమవారం సమావేశమై.. కంపెనీకి కొంత మొత్తంలో ‘వయబులిటీ గ్యాప్ ఫండ్'ను సమకూర్చే అంశంపై చర్చించవచ్చని భావిస్తున్నారు. 2004-05లో రూ. 10,183 కోట్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ లాభాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2010-11 నాటికి సంస్థ రూ.6,384.26 కోట్ల నష్టాలో కూరుకుపోయింది. ఆదాయంలో అధికభాగం వేతనాలకు వెచ్చించాల్సి రావడం, 3జీ, బీడబ్ల్యూఎ స్పెక్ట్రమ్‌లు పొందేందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు.
2010-11లో రూ.29,688 కోట్లున్ను సంస్థ ఆదాయం, 2011-12లో రూ.27,934 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం నష్టాలను కొంత అదుపుచేయగలిగామని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. టెలికామ్ రెగ్యులేటరీ అధారిటీ ప్రకారం జూన్ 30, 2012 నాటికి ల్యాండ్స్ లైన్స్ విభాగంలో 69.08 శాతం, వైర్‌లెస్ విభాగంలో 10.52 శాతం మార్కెట్ షేర్ ఉన్నట్లుగా తెలిపింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications