
రేపు(శుక్రవారం) ఫెడ్ ఛైర్మన్ బెన్ బెర్మాంకీ ప్రసంగ ఉన్న కారణంగా మార్కెట్లో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవాడనికి పెద్దగా ఇష్టపడడం లేదు. దీంతో ఈరోజు ఉదయం నుండే ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోగా.. సింగపూర్ నిప్టీ 10 పాయింట్లకు పైగా కోల్పోతూ 5,280 సమీపంలో ట్రేడవుతోంది.
స్టాక్ మార్కెట్లలో ఆర్కిడ్ కెమికల్స్ తన పెన్సిలిన్, పీనెమ్ వ్యాపారాన్ని అమెరికాకు చెందిన హోస్పిరా అనే కంపెనీకి 200 మిలియన్ డాలర్లకు అమ్మింది. అమెరికా, కెనాడాల్లో షేల్ గ్యాస్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఓన్‌జీసీ చర్చలు జరుపుతుంది. టెక్ మహీంద్రాలో కొంత వాటా అమ్మాలని బ్రిటిష్ టెలికామ్ ఆలోచిస్తుంది. ప్రముఖ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌లో ప్రమోటర్లు 70 కోట్ల రూపాయల షేర్లను అమ్మడం జరిగింది.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. యూరోప్ మార్కెట్లలో జర్మనీ సూచీల స్వల్పంగా లాభపడగా.. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు అరశాతం దాకా నష్టపోయాయి. యూరో జోన్ రుణ సమస్య పరిష్కారానికి కట్టబుడి ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియా మాంటిలు ప్రకటించారు. ఇటలీ బడ్జెట్ సంస్కరణలు బాగా చేపట్టారని మెర్కెల్, మాంటిని ప్రశంసించారు. ఇక అమెరికాలో డౌజోన్స్ సూచీ ప్లాట్‌గా ముగిసింది. మరో స్టాక్ మార్కెట్ నాస్డాక్ మాత్రం స్వల్పంగా లాభపడింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications