
ఖాతాలో ఉన్న సెక్యూరిటీల విలువ రూ.50,000 కన్నా తక్కువగా ఉంటే గనుక ఎటువంటి వార్షిక నిర్వహణ రుసుములు ఉండవు. రూ.50,001 నుండి రూ. 2లక్షల లోపు విలువ చేసే సెక్యూరిటీలను ఉంచితే వార్షిక నిర్వహణ రుసుములు రూ.100 వరకు ఉండనుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ బీఎస్‌డీఏ ఖాతాల్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సెక్యూరిటీస్‌ను ఉంచుకోవచ్చు.
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఖాతాలు ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని డిపాజిటరీలను సెబీ ఆదేశించింది. ఒక్క డీమ్యాట్ అకౌంటు తీసుకునేవారు, ఇతరత్రా డీమ్యాట్ అకౌంట్లు ఉన్నప్పటికీ.. హొల్డింగ్ విలువను సెక్యూరిటీల రోజువారీ ముగింపు ధర లేదా మ్యూచువల్ ఫండ్‌లకు చెందిన యూనిట్లకయితే ఎస్‌ఏవీల ఆధారంగా డీపీలు నిర్దారిస్తాయి. త్రైమాసికంలో ఏదానా లావాదేవీ జరిగినపుడు ఆయా లావాదేవీల వివరాలతో స్టేట్ మెంట్‌లను మూడు నెలలకొకసారి స్టేట్‌మెంట్‌ను డిపాజిటరీలు పంపాలి.
ఔత్సాహిక ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు.. ఐపీవోల రూపంలో నిధులను సమీకరించుకోవడాన్ని సులభతరం చేస్తూ లాకిన్ నిబంధనలను సెబీ సడలించింది. మూడేళ్ల లాకిన్ వ్యవధికి సంబంధించి నిర్దేశిత 20 శాతం వాటాల పరిమాణాన్ని పాటించేందుకు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ల (ఏఐఎఫ్) సహకారం తీసుకోవచ్చని సూచించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications