నచ్చకపోతే మరో ఉద్యోగం వెతుక్కోండి: డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి

కాంచీపురానికి సమీపంలోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో జరిగిన మూడో వార్షిక ఆర్దిక సదస్సులో బ్యాంకింగ్ వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు అతి ముఖ్యమైన బ్యాంక్ ఏది అని ఓ విద్యార్ది అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నిస్సందేహంగా ఎస్‌బీఐనే అవుతుందని ఆయన చెప్పారు. బ్యాకింగ్ వ్యవస్ద అనే అడవిలో ఎస్‌బీఐ ఒక పెద్ద చెట్టు. ఈ చెట్టుకు నిప్పంటుకుంటే అది మిగిలిన చెట్లను దహించివేస్తుందని అన్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్ద వైఫల్యానికి కారణం అవుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి అన్నారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్, ఎస్‌బీఐ ఛైర్మన్‌ల గొడవకు కారణం:
సాధారణంగా బ్యాంకులు తాము సమీకరించిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాలి. దీనిని (నగదు నిల్వల నిష్పత్తి)సీఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4.75 శాతంగా ఉంది. అయితే, ఈ సీఆర్‌ఆర్ వల్ల ఉపయోగమేమీ లేదని, ఆర్‌బీఐ దీన్ని అనవసరంగా బ్యాంకులపై రుద్దుతోందంటూ చౌదరి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్న బీమా కంపెనీలు, నాన్ బ్యాం కింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌కి సీఆర్‌ఆర్‌ను ఎందుకు వర్తింపచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఆర్‌ఆర్ కింద రిజర్వ్ బ్యాంక్ వద్ద తాము ఉంచే నిధులపై ఎలాంటి వడ్డీ ఆదాయమూ రాదని, దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ రూ. 21,000 కోట్ల మేర నష్టపోతోందని చౌదరి పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications