Q1లో ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ. 11,000 కోట్లు

నివేదిక ప్రకారం ఎన్‌టీపీసీలో 53.1 కోట్ల డాలర్లు, ఇన్పోసిస్ 35.6 కోట్ల డాలర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 26.9 కోట్ల డాలర్లు, కెయిర్న్ ఇండియా 22.1 కోట్ల డాలర్లు, బజాజ్ ఆటో 19.9 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. ఇది ఇలా ఉంటే మీడియా, హోటళ్లు, కన్సూమర్ గూడ్స్ సంస్దలకు చెందిన 11.5 డాలర్లు (దాదాపు రూ. 638 కోట్లు) విలువ కలిగిన స్టాక్స్ అమ్మేసింది.
టాటా మోటార్స్‌లో 5.8 కోట్ల డాలర్లు, సిండికేట్ బ్యాంక్ 4.9 కోట్ల డాలర్లు, హెచ్‌యూఎల్ 4.5 కోట్ల డాలర్లు, ఆలహాబాద్ బ్యాంక్ 3.2 కోట్ల డాలర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక స్టాక్స్‌లో 2.3 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకుంది. మొత్తం మీద జూన్ క్వార్టర్‌లో ఎల్‌ఐసీ నికర కోనుగోలుదారుగా నిలవడంతో అధిక మొత్తంలో పెట్టుబడులను ప్రైవేటు రంగ కంపెనీల స్టాక్స్‌లోనే పెట్టినట్లు నివేదికలో వెల్లడైంది.
కాగా, ఎల్‌ఐసీ మొత్తం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఫైనాన్షియల్ రంగం స్టాక్స్ వాటా 25 శాతం కాగా, తర్వాత స్థానాల్లో ఇంధన రంగం(15 శాతం), కన్సూమర్ గూడ్స్(12 శాతం), పారిశ్రామిక రంగం(10 శాతం) ప్రధానంగా ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications