హైదరాబాద్, ఆగస్టు 24: గతంలో బ్యాంకుల నుండి రుణాలు పొందాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు రుణాలను ప్రజలకు మరింత దగ్గరగా చేర్చడం కోసం హైదరాబాద్‌కు చెందిన దీపాంకర వెబ్ వెంచర్స్ అనే సంస్ద ‘ఐ-లెండ్' పేరుతో తొలి ‘‘పీర్ టు పీర్ లెండింగ్ ఫ్లాట్‌ఫాం'' అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బ్యాంకుల నుండి లోన్స్ పొందలేని వారికి, అలాగే బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ పొందాలనుకునే వారికి ఐ-లెండ్ వెబ్‌సైట్ మధ్యవర్తిత్వం మాదిరి పని చేస్తుందన్నమాట.
ఈ సంస్ద ఫౌండర్ డైరైక్టర్ వివిఎస్ఎస్‌బి శంకర్ మాట్లాడుతూ తమ వెబ్‌సైట్‌లో రుణం ఇవ్వడానికి లేదా తీసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకుంటే వారి వివరాలను పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తులకు ఈ సమాచారం అందిస్తామని, ఇద్దరికీ అంగీకారం కుదిరితేనే రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇద్దరికీ మధ్యలో ‘ఐ-లెండ్' ఒక వారధిగా మాత్రమే పనిచేస్తుందని, ఈ లావాదేవీలకు తాము ఎలాంటి బాధ్యత వహించబోమని స్పష్టం చేశారు. రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు రుణాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తీసుకోవచ్చు.
సభ్యునిగా నమోదు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయడం జరుగుతుందని, ఆ తర్వాతనే వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఈ సేవలను అందిస్తున్నందుకు రుణదాతల నుంచి ఒక శాతం, స్వీకరించబోయే వారి నుంచి నాలుగు శాతం ఫీజును ‘ఐలెండ్' వసూలు చేస్తుంది. రుణం తీసుకున్న వారి బాకీలు చెల్లింపులపై ‘ఐ-లెండ్' ఎలాంటి హామీ ఇవ్వదని శంకర్ స్పష్టం చేశారు.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
పేర్లు నమోదు చేసుకోని.. వెబ్‌సైట్ ద్వారా రుణాలు పొందండి | I-Lend Wesite Introduces Social Lending in India | పేర్లు నమోదు చేసుకోని.. వెబ్‌సైట్ ద్వారా రుణాలు
I-lend is India’s first online P2P lending platform, designed to facilitate low cost loans for borrowers while increasing the return and managing risk for the lenders. I-lend combines traditional lending practices with social networking to create the platform where borrowers and lenders transact.
Story first published: Friday, August 24, 2012, 10:31 [IST]
Other articles published on
Aug 24, 2012