ముంబై, ఆగస్టు 22: ఇండియా బెంచ్ మార్క్ ఇండిసెస్ ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.00 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 19 పాయింట్లు దాకా నష్టపోతూ 17,865 పాయింట్ల సమీపంలో ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ 9 పాయింట్లు దాకా నష్టపోతూ 5,411 సమీపంలో ట్రేడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకు, నాగార్జున కనస్ట్రక్షన్స్, షిప్పింగ్ కార్పోరేషన్, సౌత్ ఇండియన్ బ్యాంకు షేర్లను ఎప్‌అండ్‌ఓ నుండి తొలగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించింది.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు యూరప్ మార్కెట్లు లాభపడగా మిగిలిన మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. యూరో జోన్ రుణ సమస్య తీవ్రతను తగ్గించేందుకు స్పెయిన్, ఇటలీ బాండ్లను యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని సమాచారం. దీంతో యూరో స్టాక్ మార్కెట్ల కరెన్నీ బలపడడంతో పాటు మార్కెట్లు లాభపడ్డాయి.
ఫ్రాన్స్ సూచీ 0.93 శాతం, జర్మనీ సూచీ 0.78 శాతం, బ్రిటన్ సూచీ 0.57 శాతం పెరగగా.. అమెరికా మార్కెట్లలో డౌజోన్స్ 0.52 శాతం, నాస్డాక్ 0.29 శాతం నష్టపోయాయి. సింగపూర్ నిప్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోతూ 5,420కి సమీపంలో ట్రేడ్ అవుతుంది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
స్టాక్ మార్కెట్ కబుర్లు (బుధవారం ఆగస్టు 22): నష్టాలతో ప్రారంభం | Indian indices open lower; track weak Asian markets | నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
India's benchmark indices opened lower today, tracking weak markets across the globe. The BSE Sensex was trading lower by 45 points at 17,839 points, while the Nifty was trading lower by 15 points at 9.25 am IST.
Story first published: Wednesday, August 22, 2012, 10:37 [IST]
Other articles published on
Aug 22, 2012