
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో ఉంది. బ్యాంకల విలీనం, బ్యాంకుల్లో ప్రైవేటు, విదేశీ మూలధనాన్ని అనుమతించడం, పరిమితి లేని ఓటింగ్ హక్కులు వంటి వాటికి మార్గం సుగమనం చేయడానికే మార్పులు చేస్తున్నారని విశ్వాస్ అరోపించారు. వీటితో పాటు ప్రస్తుతం జీత భత్యాలకు సంబంధించి అన్ని బ్యాంకులకు ఉమ్మడి నిబంధనలు ఉన్నాయ.
బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయడానికి కారణం:
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులకు ఉద్దేశించిన బిల్లులో 50 శాతం ఆఫీసర్ ఉద్యోగాలను మార్కెట్ నుండి రిక్రూట్ చేసుకోవాలని, మిగిలిన 50 శాతం ఉద్యోగాలకు క్లర్కులను ప్రమోట్ చేయాలని సూచించింది. క్లర్కు కావాలంటే కనీసం డిగ్రీ చదివి ఉండాలని.. ప్రస్తుతం ఇంటర్ చదివిన వారు కూడా బ్యాంకు క్లర్కుగా వస్తున్న విషయం తెలిసిందే. క్లాస్ - 4 ఉద్యోగుల అర్హతను 8వ తరగతి నుండి ఇంటర్ వరకు పెంచింది. లాభదాయకత, ఉత్పాదకతు అనే అంశాల ఆధారంగా నిర్ణయించాలని కమిటీ సూచించింది. వేతనాన్ని కొంత ఫిక్స్‌డ్ గా, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి ఫెర్పామెన్స్ ఆధారంగా నిర్ణయించాలని బిల్లులో పేర్కొంది. ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications