
ఢిల్లీ తర్వాత ముంబై, బెంగుళూరు, పూణె, చెన్నైలు ఆక్రమించాయి. టైర్ -2 క్యాటగారీకి వస్తే లక్నో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి 1,698 కొలువులు, చండీగఢ్, వడోదరా, జైపూర్, సూరత్‌లలో కూడా ఎక్కువగానే కొలువులు సృష్టించబడ్డాయి. టైర్ -3 విషయానికి వస్తే డెహాడూన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 650 కొలువులు సృష్టించబడ్డాయి. టైర్-3కే సంబంధించిన మిగిలిన నగరాల విషయానికి వస్తే, గ్వాలియన్, లూధియానా, భువనేశ్వర్, రాయ్‌పూర్‌లు నిలిచాయి. కాగా ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోనే ఎక్కువగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
ఈ సంవత్సరం ఆరంభం నుండి జులై వరకు దేశమంతటా లక్షా ఇరవై వేలకు పైగా జాబ్స్ లభించినట్లు 'జాబ్ ట్రెండ్స్ అక్రాస్ సిటీస్ అండే సెక్టార్స్' పేర్కొంది. ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్, పైనాన్షియల్ సేవలు, వాహన రంగం, ఈ ఐదు రంగాల్లో దేశంలో గరిష్టంగా ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఐతే గత ఆర్దిక సంవత్సరమైన 2011- 12 చివరి త్రైమాసికానికి (జనవరి - మార్చి)తో పోలిస్తే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ - జూన్) మధ్య మొత్తం ఉద్యోగావకాశాల కల్పనలో 20 శాతానికి తగ్గింది.
టైమ్స్ జాబ్స్ డాట్. కామ్, నౌకరీ.కామ్ వంటి ఆన్ లైన్ జాబ్ పోర్టళ్లతో పాటు 56 నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు, 32 రంగాల్లో అసోచామ్ రిసర్చ్ట్ బ్యూరో నిశితంగా పరిశీలించి ఈ నివేదకను రూపొంచడం జరిగిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications