
అనేక సూచనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఆగస్టు 14న సిన్హా కలిసినప్పుడు ఈ సూచలను పరిశీలించాలని ఆయన్ను కోరాను. ప్రభుత్వ, సెబీ పరిశీలన రెండు వారాల్లో పూర్తవతుంది. సెప్టెంబర్ ప్రారంభంలో మరోసారి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిన్హాను కోరానని చిదంబరం తెలిపారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం ప్రకటించిన ఐపీవో, మ్యూచువల్ ఫండ్స్ సంస్కరణలపై చిదంబరం సంతృప్తిని వ్యక్తం చేశారు.
స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న అందరూ ఈ నిర్ణయాల వల్ల హార్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పైనాన్షియల్ సాధనాల్లో గృహస్దుల మదుపు పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు మరింతగా లాభిస్తుంది. ఐపీఓ ద్వారా నిధులను మరింత సులభంగా సమీకరించడానికి, తక్కువ వ్యయంతో మదుపు చేయడానికి గురువారం సెబీ అనేక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
చిదంబరం ఆర్దిక మంత్రి అయిన తర్వాత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రెండోసారి కలిశారు. దేశ స్దూల ఆర్దిక పరిస్దితులను సమీక్షించారు. వీటితో పాటు కొత్తగా రూపొందించిన విధానంలో దేశీయంగా పెట్టుబడులు పెట్టేందుకు ఏడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను సెబీ అనుమతించింది. దీనిలో భాగంగా రియల్టీ, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ విభాగాలలో నిధులను ఒకే చెట్టు కిందకు తీసుకురావడం ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించిన విషయం విదితమే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications